అంతర్జాతీయం

కొరియాల మధ్య చల్లారిన సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, జనవరి 9: చిరకాలంగా తమ మధ్య నెలకొన్న వైరాన్ని తగ్గించుకునేందుకు ఉభయ కొరియాల మధ్య అరుదైన రీతిలో చర్చలు జరిగాయి. ఈ చర్చల పర్యవసానంగా దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్ క్రీడలకు తమ బృందాన్ని పంపేందుకు ఉత్తర కొరియా సుముఖత తెలిపింది. రెండేళ్ల విరామం తర్వాత ఈ రెండు దేశాల ప్రతినిధులు చర్చలకు మంగళవారం నాడు నాంది పలికారు. దక్షిణ కొరియాతో సంబంధాలను మెరుగుపరచుకోవాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిర్ణయించడంతో ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. కాగా, దక్షిణ కొరియా, అమెరికాల బంధాన్ని బలహీన పరచాలనే వ్యూహంతోనే కిమ్ చర్చలకు అనుమతించారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఒత్తిళ్లు, కేటాయింపులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆయన పావులు కదిపారని విశే్లషకులు భావిస్తున్నారు.
దక్షిణ కొరియాలో జరిగే వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే ఉత్తర కొరియా బృందంలో క్రీడాకారులు, చీర్ లీడర్స్, అధికారులు, పాత్రికేయులు, ఇతరులు ఉంటారు. తమ దేశంలోని పాన్‌ముంజొమ్ గ్రామంలో ఉభయ దేశాల ప్రతినిధులు భేటీ అయినట్లు దక్షిణ కొరియా మంత్రి చున్ హే-సంగ్ తెలిపారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ఉత్తర కొరియాకు ద్వారాలు తెరిచే ఉన్నాయని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఇదివరకే ప్రకటించింది. ఫిబ్రవరి 9 నుంచి 25 వరకూ జరిగే వింటర్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియా క్రీడాకారులతో పాటు ఉత్తర కొరియా క్రీడాకారులు మార్చ్ఫాస్ట్‌లో పాల్గొంటారు. ప్రారంభ, ముగింపు వేడుకలకు హాజరవుతారు. ఉభయ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు ఆశాజనకంగా సాగాయని చున్ తెలిపారు. 2015లో ఉభయ కొరియాల మధ్య ఆఖరి సారి చర్చలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. సరిహద్దు ప్రాంతమైన పన్‌ముంజొమ్‌లో చర్చలు జరిగినపుడు సమీపంలోనే ఇరు దేశాల సైనికులు విధి నిర్వహణలో ఉన్నారు. నూతన సంవత్సరంలో ఈ చర్చలు ఉభయ దేశాల ప్రజలకు మంచి కానుక అని, ఒలింపిక్స్‌లో తమ దేశం మంచి ఫలితాలను సాధిస్తుందని ఉత్తర కొరియా ప్రతినిధి రీ సన్ గ్వోన్ అన్నారు.

చిత్రం..ఉత్తర కొరియా తక్షణం అణ్యాయుధాలకు స్వస్తి పలికి శాంతిని నెలకొల్పాలని సియోల్‌లో ప్లకార్డులను ప్రదర్శిస్తున్న దక్షిణ కొరియా వాసులు