అంతర్జాతీయం

థెరిసా మే కేబినెట్‌లో నారాయణ మూర్తి అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 10: బ్రిటన్‌లో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన ఎంపీలు ప్రధాని థెరిసామే కేబినెట్‌లో చేరారు. ఐటీ దిగ్గజం, ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి అల్లుడు రిషీ సునాక్‌కు కీలక పదవువి దక్కనుంది. నార్త్ ఇంగ్లిష్‌లోని రిచ్‌మండ్ (యార్క్‌షైర్) నుంచి కన్జర్వేటీవ్ పార్టీ తరఫున సునాక్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2015లోబ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన కన్జర్వేటీవ్ పార్టీలో రైజింగ్ స్టార్‌గా చెబుతారు. గృహ నిర్మాణం, కమ్యూనిటీస్, స్థానిక ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు అప్పగించనున్నట్టు ఓ అధికార ప్రకటనలో వెల్లడించారు. అలాగే మరో ఎన్నారై ఎస్ ఫెర్నాండెజ్ మరో కీలక పదవి దక్కింది. గోవాకు చెందిన ఆయన దక్షిణ నియోజకవర్గం ఫేర్‌హామ్ నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రిగ్జిట్ ఉద్యమ ప్రచార కార్యకర్తగా ఆయన పనిచేసి కన్జర్వేటీవ్ పార్టీలో మంచి పేరు సంపాదించారు. ఇక నారాయణ మూర్తి అల్లుడు సునాక్ ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. బ్రిగ్జిట్‌కు గట్టి మద్దతుదారుడు.