అంతర్జాతీయం

ఫిబ్రవరి 23న రఘునందన్‌కు ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 11: అమెరికాలో జరిగిన జంట హత్యల కేసులో ఇండో- అమెరికన్ రఘునందన్ యండమూరి (32)కి పెన్సిల్వేనియా కోర్టు మరణశిక్ష విధించింది. పదేళ్ల సాన్వీ వెన్నా, ఆమె అమ్మమ్మ సత్యవతి వెన్నా (61)ను రఘునందన్ దారుణంగా చంపేశాడు. సాన్వీని కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేయాలన్న అతడి ప్రయత్నం బెడిసికొట్టింది. సాన్వీనీ, ఆమె అమ్మమ్మను హత్యచేశాడు. కేసు తీవ్రతను బట్టి రఘునందన్‌కు అమెరికా కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఫిబ్రవరి 23న మరణశిక్ష అమలుచేస్తారని టైమ్స్ హెరాల్డ్‌లో వార్త వెలువడింది. ఇండో-అమెరికన్‌కు ఇక్కడ మరణశిక్ష పడడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం రఘునందన్ యండమూరి (32) ఆంధ్రప్రదేశ్‌కు చెందినవాడు. భార్యతో కలిసి పెన్సిల్వెనియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. కింగ్ ఆఫ్ ప్రెస్సియా అపార్ట్‌మెంట్‌లోనే స్వానీ తల్లిదండ్రులు ఉండేవారు. స్వానీ తల్లిదండ్రులు ఆఫీసుకు వెళ్లిపోగా అమ్మతోనే ఉంది. హెచ్1బీ వీసాతో అమెరికాకు వచ్చిన రఘునందన్ వ్యసనాలకు బానిస అయ్యాడు. సాన్వీని కిడ్నాప్ చేసి ఆమె తల్లిదండ్రులను నుంచి డబ్బులు గుంజాలని పథకం వేశాడు. పది నెలల పాపను కిడ్నాప్ చేస్తుండగా అమ్మమ్మ సత్యవతి అడ్డుకుంది. దీంతో ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. అమెరికాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో రఘునందన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.