అంతర్జాతీయం

ట్రంప్.. రైట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 18: పాకిస్తాన్ ఓ పక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరోపక్క అబద్ధాలాడుతూ తమను మోసం చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికా శే్వతసౌధం గట్టిగా సమర్ధించింది. ఇన్నాళ్లూ తమ నాయకులను వెర్రివాళ్లను చేసి గత పదిహేనేళ్లుగా 33 బిలియన్ డాలర్ల సాయం కొట్టేసిందని మండిపడ్డ ట్రంప్ ఇకనుంచి నయాపైసా సాయం చేయబోమని ఇటీవల ప్రకటించారు. పాకిస్తాన్‌కు అందజేయాల్సిన 2 బిలియన్ డాలర్లను ఇచ్చేది లేదని ఇటీవల ట్రంప్ తెగేసి చెప్పారు. ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులకు పాకిస్తాన్ భూతల స్వర్గంగా ఉందని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇకనుంచి పాకిస్తాన్‌కు అందజేయాల్సిన భద్రతా సాయం ఉండదని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాలిబన్లు, హక్కానీ నెట్‌వర్క్ ఇస్లామాబాద్ కనుసన్నల్లోనే నడుస్తోందని అధ్యక్షుడు తన ట్విట్టర్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని వైట్‌హౌస్ గట్టిగా సమర్థించింది. ‘ఔను పాకిస్తాన్‌పై మా అధ్యక్షుడి వైఖరిని సమర్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని వెనకేసుకొస్తున్న పాక్‌పై మా విధానం స్పష్టంగా ఉంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తిరుగేలేదు’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ శారా సాండర్స్ స్పష్టం చేశారు. భద్రతా సాయం నిలిపివేయడం వల్ల పాక్‌పై వత్తిడి తీసుకురావొచ్చన్నదే తమ ఉద్దేశమని, అది ఫలిస్తుందని ఆమె చెప్పారు.
ఉగ్రవాదంపై తన వైఖరి మార్చుకునేలా అన్ని వైపుల నుంచి వత్తిడి తేవాలని ఐరాస భద్రతా మండలిలో అమెరికా రాయబారి నిక్కీహేలీ డిమాండ్ చేసిన మర్నాడే వైట్‌హౌస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పాక్ బుద్ధి మార్చుకునేలా వత్తిడి తేవడానికి 15 మంది సభ్యులుగల హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలని అఫ్గనిస్తాన్ నిర్ణయించిందని ఆమె వెల్లడించారు. ఎలాంటి వత్తిడి తెస్తే పాక్ దారిలోకి వస్తుందో ఆ మార్గంలో వెళ్లాలని, దానికి తమ మద్దతు కావాలని అఫ్గనిస్తాన్ కోరినట్టు నిక్కీ స్పష్టం చేశారు. దీనికోసం పది అంశాల ఫార్ములాతో ముందుకెళ్లాలని ఆ దేశం నిర్ణయించినట్టు ఇండియన్-అమెరికన్ రాయబారి తెలిపారు. ఇందులో భాగంగా వచ్చేనెలలో ఐరాస భద్రతా మండలి సభ్యులు కాబూల్‌లో పర్యటిస్తారు.

చిత్రం.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ శారా సాండర్స్