అంతర్జాతీయం

సరుూద్‌పై ఎలాంటి చర్యా తీసుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 18: ‘జమాత్- ఉద్-దవా’ అధినేత హఫీజ్ సరుూద్‌కు వ్యతిరేకంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ‘సరుూద్ సాహెబ్’పై తమ దేశంలో ఎలాంటి కేసు నమోదు కానందున ఏ రకమైన చర్యా తీసుకోవడం లేదని పాక్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ ప్రకటించారు. 2008లో ముంబయి పేలుళ్లకు సూత్రధారి అయిన సరుూద్‌కు ఆయన ‘క్లీన్‌చిట్’ ఇస్తూ, ఏ కేసు లేనందున ‘జమాత్-ఉద్-దవా’ అధినేతను గత నవంబర్‌లో గృహనిర్బంధం నుంచి విడుదల చేసినట్టు గుర్తుచేశారు. ముంబయి పేలుళ్లలో 166 మంది మరణానికి పథక రచన చేసింది సరుూద్ అని భారత్ ఐక్యరాజ్యసమితికి గతంలోనే ఫిర్యాదు చేసింది. ‘పాక్‌లో సరుూద్‌పై ఏ కేసూ లేదు.. ఒక్క కేసు ఉన్నా మేం చర్య తీసుకుంటాం’ అని అబ్బాసీ మీడియాతో అన్నారు. ‘ఐక్యరాజ్యసమితి సరుూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాది అని గుర్తించినా చర్య తీసుకోరా?’ అని విలేఖరులు ప్రశ్నించగా పాక్ ప్రధాని తన స్పందన తెలియజేశారు. ‘మిల్లీ ముస్లిం లీగ్’ పేరిట ఈ ఏడాది జరిగే పాక్ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని స్థానాలకూ పోటీ చేస్తామని సరుూద్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆయన తన రాజకీయ పార్టీని ఎన్నికల సంఘంలో నమోదు చేయాల్సి ఉంది. సరుూద్ తలపై 10 మిలియన్ అమెరికన్ డాలర్ల రివార్డును అమెరికా ప్రకటించింది. గృహనిర్బంధం నుంచి విడుదలైన సరుూద్‌ను మళ్లీ అరెస్టు చేయాలని అమెరికా పాక్‌పై ఒత్తిడి తెస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని స్పష్టం చేయడం గమనార్హం. కాశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఓసీ) వద్ద ఉల్లంఘనలు ఉంటే ప్రతీకారం తప్పదని భారత్ గ్రహించాలని అబ్బాసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.