అంతర్జాతీయం

సరుూద్‌ను విచారించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 19: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సరుూద్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, చట్టప్రకారం అన్ని కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరపాలని అమెరికా గట్టిగా డిమాండ్ చేసింది. ఐక్యరాజ్య సమితి ఇప్పటికే సరుూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించినందున అతనిపై పాకిస్తాన్ తక్షణం విచారణ చేపట్టాలని అమెరికా తన స్వరం పెంచింది. తమ దేశంలో సరుూద్‌పై ఎలాంటి కేసులు లేనందున అతనిపై విచారణ జరిపే ప్రసక్తే లేదని పాక్ ప్రధాని షాహిద్ ఖాక్వాన్ అబ్బాసీ ప్రకటించిన నేపథ్యంలో అమెరికా ఘాటుగా స్పందించింది. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సరుూద్‌ను ‘సాహెబ్’ (సార్) అని పాక్ ప్రధాని సంబోధించిన సంగతి తెలిసిందే.
సరుూద్‌పై పూర్తిస్థాయి విచారణ జరపాలన్న తమ డిమాండ్ గురించి ఇప్పటికే పాకిస్తాన్‌కు తెలియజేశామని అమెరికా ‘స్టేట్ డిపార్ట్‌మెంట్’ అధికార ప్రతినిధి హీతర్ నారెట్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తమ అభిప్రాయాన్ని పాక్‌కు నిర్మొహమాటంగా చెప్పామన్నారు. పాక్ ప్రధాని అబ్బాసీ చేసిన వ్యాఖ్యలను హీతర్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకువెళ్లగా- ‘అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవాకు చెందిన ఉగ్రవాదిగానే సరుూద్‌ను పరిగణిస్తాం.. 2008లో ముంబయి పేలుళ్లకు సూత్రధారి అతడే అని మేం భావిస్తున్నాం.. ఈ ఘాతుకానికి దిగిన లష్కరే సంస్థతో కలసి సరుూద్ సంస్థ పనిచేసింది.. ఆ పేలుళ్లలో అమెరికన్లు సహా 168 మంది మరణించారు..’ అని అన్నారు. సరుూద్ స్థాపించిన జమాత్-ఉద్-దవాను ఉగ్రవాద సంస్థగానే అమెరికా పరిగణిస్తోందని ఆమె స్పష్టం చేశారు. గృహనిర్బంధంలో ఉన్న సరుూద్‌ను గత నవంబర్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేశాక అమెరికా, పాక్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగింది.
ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ దేశానికి రెండు బిలియన్ డాలర్ల సహాయాన్ని అమెరికా నిలిపివేసింది. జమాత్-ఉద్- దవాను విదేశీ ఉగ్రవాద సంస్థగా 2014లోనే అమెరికా ప్రకటించింది. కాగా- మిలటరీ, ఇంటిలిజెన్స్ రంగాల్లో సహకారాన్ని పాక్ రద్దు చేసుకుందన్న వార్తలను ప్రస్తావించగా, దీనికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని అమెరికా ‘స్టేట్ డిపార్ట్‌మెంటు’ తెలిపింది.