అంతర్జాతీయం

మీ వాళ్లను కట్టడి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 19: సరిహద్దులో భారత సైనికులు కవ్వింపుచర్యలకు పాల్పడడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇటీవల ఎక్కువైందని పాక్ ఆరోపిస్తోంది. భద్రతాదళాల కాల్పుల్లో తమ పౌరులు మృతి చెందారని శుక్రవారం ఇక్కడ భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌ను పిలిపించి నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ (దక్షిణ ఆసియా,సార్క్) మహ్మద్ ఫైజల్ డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి తన నిరసన తెలిపారు.‘్భరత జవాన్ల కవ్వింపుచర్యలు ఎక్కువయ్యాయి. ఎల్‌ఓసీ వద్ద కాల్పులకు తెగబడుతున్నారు. సియాల్‌కోట్ సెక్టార్‌లో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారు’ అని ఫైజల్ ఆరోపించారు. భారత్ కాల్పుల్లో 24 ఏళ్ల పాకిస్తాన్ యువకుడు మృతి చెందాడని, హర్పల్ గ్రామంలో తొమ్మిది మంది గాయపడ్డారని పాక్ ఫిర్యాదు చేసింది.‘ సరిహద్దులో అత్యాధునిక ఆయుధాలతో భద్రతాదళాలు విచక్షణారహితంగా కాల్పులు జరుతున్నాయి. గత రెండు రోజులుగా జనవాసాలను లక్ష్యంగా చేసుకుని మరీ కాల్పులకు పాల్పడుతున్నారు’అని ఆయన ఆరోపించారు. సరిహద్దుల్లో ఈ పరిస్థితి నిత్యం ఉంటోందని ఫైజల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ప్రారంభమై పందొమ్మిది రోజుల్లోనే కనీసం 125 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించారని జేపీ సింగ్‌కు తెలిపారు.