అంతర్జాతీయం

భారత్ వృద్ధి మీకూ లబ్ధి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జూన్ 18: భారత్ ఆర్థిక వృద్ధి పొరుగుదేశాలకు దోహదకారి కావాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. శ్రీలంకలోని జాఫ్నా ప్రాంతంలో భారత్ సాయంతో పునర్నిర్మించిన స్టేడియంను శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనతో కలిసి మోదీ ప్రారంభించారు. 1996నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ స్టేడియంను దాదాపు 7 కోట్ల రూపాయల భారత్ సాయంతో పునర్నిర్మించారు. జాఫ్నా మాజీ మేయర్ దివంగత అల్‌ఫ్రెడ్ తంబిరాజా దురైయప్ప జ్ఞాపకార్థం ఈ స్టేడియంకు దురైయప్ప స్టేడియంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడుతూ ఇది ఒక ‘చరిత్రాత్మక దినం’గా అభివర్ణించారు. శ్రీలంక ఆర్థికంగా బలోపేతం కావాలని భారతదేశం కోరుకుంటోందని ఆయన చెప్పారు. ‘ఏకత్వం, సమగ్రత, శాంతి సామరస్యం, భద్రత, సమాన అవకాశాలులాంటి అన్ని అంశాల్లోను ఆ దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలి. మన సంబంధాలు కేవలం మన రెండు ప్రభుత్వాలకు పరిమితం కాదు. మన చరిత్ర, సంస్కృతి, భాష, కళలు, భౌగోళిక పరిస్థితులు అన్నిటిలోను అవి ఎంతో బలంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య దృఢమైన సంబంధాలను భారత్ కోరుకుంటోంది. తన ఆర్థిక వృద్ధి పొరుగుదేశాలకు లబ్ధి చేకూర్చాలని భారత్ బలంగా కోరుకుంటోంది’ అని మోదీ అన్నారు. కమ్యూనిషన్ రంగంలోని ఆధునిక పరికరాలు 125 కోట్ల భారతీయులు, స్నేహశీలురైన శ్రీలంక ప్రజలు ఈ వేడుకల్లో పాలుపంచుకునేలా చేశాయని ఆయన చెప్పారు. 1850 మంది కూర్చునే వీలున్న ఈ క్రీడా ప్రాంగణం అంతర్యుద్ధంతో అతలాకుతలమైన జాప్నా ప్రాంతంలో క్రీడలు, ఇతర కార్యక్రమాల ప్రోత్సాహకానికి అవసరమైన వౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా ఈ ప్రాంత యువత సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. ఈ స్టేడియం, కేవలం ఇటుకలు, బండరాళ్లు కాదని, జాప్నా ప్రాంత యువత బంగారు భవితకు వేదిక అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఈ సందర్భంగా సిరిసేన మాట్లాడుతూ శ్రీలంక అభివృద్ధి కోసం భారత్ సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. వివిధ అంశాల్లో భారత్ అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదన్నారు. కొన్ని సందర్భాల్లో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించి ఇరుదేశాల సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. ఈ క్రీడావేదిక దేశ ఐకమత్యానికి గుర్తని సిరిసేన అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళ మైనారిటీలతో సఖ్యతకోసం సిరిసేన ఎన్నో చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈ సందర్భంగా రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలాది మంది విద్యార్థులు స్టేడియంలో నిర్వహించిన సూర్య నమస్కారాన్ని సిరిసేనతో కలిసి మోదీ తిలకించారు. వీరితోపాటుగా జాఫ్నా ముఖ్యమంత్రి సివి విఘ్నేశ్వరన్, శ్రీలంక ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం జాఫ్నాలో స్టేడియంను ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ