అంతర్జాతీయం

ఆఫ్రికా అధికార పార్టీకి కాయకల్ప చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహెనె్నస్‌బెర్గ్, జనవరి 20: దక్షిణాఫ్రికా అధ్యక్షపదవి నుంచి జాకబ్ జుమాను త్వరలోనే సాగనంపడం అనివార్యమన్న కథనాల నేపథ్యంలో అధికార ఏఎన్‌సీ పార్టీ పునర్మించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షపదవి నుంచి గతేడాది డిసెంబర్‌లో జుమాను తొలగించారు. అప్పటి నుంచీ దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ ఆయనపై తీవ్రస్థాయిలో వత్తిడి పెరుగుతునే ఉంది. జుమా అధ్యక్ష కాలంలో దేశంలో అవినీతి పెచ్చరిల్లింది. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాలంటే ఆమూలాగ్రం దాన్ని పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏఎన్‌సీ పార్టీకి సారధ్యం వహిస్తున్న ఉపాధ్యక్షుడిగా ఉన్న రమాఫోసా మద్దతుదారులు దేశాధ్యక్ష పదవిని చేపట్టాలంటూ ఆయనపై వత్తిడి తెస్తున్నారు.