అంతర్జాతీయం

భారత హైకమిషనర్‌కు పాక్ సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, జనవరి 21: అధీనరేఖ ప్రాంతంలో భారత్ సైనిక దళాలు ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు పాల్పడ్డాయంటూ వరుసగా నాల్గవ రోజైన ఆదివారం కూడా భారత డిప్యూటీ హైకమిషనర్‌ను పాకిస్తాన్ పిలిపించింది. భారత దళాల కాల్పుల కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని తెలిపింది. సోమవారం నుంచి ఇప్పటివరకూ భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీసింగ్‌ను అనేకసార్లు పిలిపించి ఈ కాల్పులకు సంబంధించి పాకిస్తాన్ సంజాయిషీ కోరింది. గత కొంతకాలంగా అధీనరేఖ ప్రాంతంలో భారత్-పాక్ దళాల మధ్య తీవ్రస్థాయి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత సైనిక దళాల కాల్పులకు సంబంధించి పాకిస్తాన్ భారత హైకమిషనర్‌కు తీవ్ర నిరసన తెలిపిందని పాక్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అధీనరేఖ ప్రాంతంలోని నిఖియాల్ సెక్టార్‌లో మోర్టార్లతోనూ, భారీ ఆయుధాలతోనూ 18 భారత సైనిక శిబిరాలు ఎలాంటి కవ్వింపు లేకుండా గత రెండు రోజులుగా కాల్పులకు ఒడిగట్టాయని, ఆ కాల్పుల్లో ఇద్దరు మరణించారని పాక్ విదేశాంగ కార్యాలయం వెల్లడించింది. భారత్ దళాలు పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం విచారకరమని పేర్కొంది. భారత్ చర్య అమానుషమే గాకుండా అంతర్జాతీయ మానవ హక్కులను ఉల్లంఘించడమేనని వెల్లడించింది.

చిత్రాలు..ఎలాంటి కవ్వింపు లేకుండా భారత్ కాల్పులకు పాల్పడుతోందని పాక్ ఆరోపిస్తున్నా.. వాస్తవికతను అద్దం పట్టే చిత్రాలివి. పాక్ సైన్యం జరిపిన దాడులకు ఆర్.ఎస్.పురాలో ఇల్లు దెబ్బతినడంతో వంట సామాన్లను తీసుకుంటున్న ఓ మహిళ. పాక్ కాల్పులకు భయపడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్న ఓ కుటుంబం.