అంతర్జాతీయం

ఖగోళంలో మరో అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 23: భూమికి దగ్గరగా ఉన్న మరో మధ్యస్థాయి గ్రహ శకలం పుడమి దిశగా దూసుకువస్తోంది. ఫిబ్రవరి 4న ఈ ఖగోళ ఘటన జరిగే అవకాశం ఉందని ఏజే 129 అనే గ్రహశకలం భూమికి సమీపం నుంచి దూసుకుపోయినా ఎలాంటి ముప్పు ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) వెల్లడించింది. ఈ గ్రహ శకలం భూమికి అతి దగ్గరగా వచ్చినా దీనికి మనకు మధ్య ఉండే దూరం భూమికి, చంద్రుడికి మధ్య ఉండే దూరం కంటే పది రెట్లు ఎక్కువని నాసా తెలిపింది. అంటే 4.2 మిలియన్ కిలోమీటర్ల దూరం నుంచి ఈ గ్రహశకలం భూమిని దూసుకుపోతుందని వివరించింది. గత 14 సంవత్సరాలుగా ఈ గ్రహశకల భ్రమణ తీరును తాము గమనిస్తునే వస్తున్నామని, ఇప్పుడు కచ్చితంగా అది భూమికి ఎంత చేరువుగా రాబోతుంది ఎంత వేగంగా దూసుకుపోతుందన్న వివరాలను తెలుసుకోగలిగామని నాసా తెలిపింది. ఏ విధంగా చూసినా కూడా ఈ గ్రహ శకలం భూమిని ఢీకొనే అవకాశం లేదని, అలాగే మరో వందేళ్ల వరకూ దీనివల్ల భూమికి ఎలాంటి ముప్పు ఉండదని నాసాకు చెందిన పాల్‌షోడాస్ వెల్లడించారు. 2002లో ఈ గ్రహ శకలాన్ని తాము గుర్తించామని దీని పరిమాణం 1.2 కిలోమీటర్ల మేర ఉండొచ్చని తెలిపారు. ఇది భూమిని సమీపించే టప్పుడు దీని వేగం సెకనుకు 34 కిలోమీటర్లని, భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహ శకలాలు అన్నింటికంటే కూడా ఏజే 129 చాలా ఎక్కువని చెప్పారు.