అంతర్జాతీయం

అలాస్కా దీవిలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలాస్కా, జనవరి 23: ఉత్తర అమెరికాలోని కొడియాక్ దీవిలో మంగళవారం తెల్లవారుజామున 7.9 పాయింట్ల తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. దీని తీవ్రత నేపథ్యంలో సునానీ హెచ్చరికను జారీ చేసినప్పటికీ తరువాత దాన్ని ఉప సంహరించుకున్నారు. రిక్టర్ స్కేల్‌పై అత్యధికంగా ఉండడంతో అలాస్కా తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు భయంతోపరుగులు పెట్టారు. కొన్ని గంటల భయాందోళనల నేపథ్యంలో ఆ హెచ్చరికలను అధికారులు ఎత్తివేశారు. భూకంపం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 12.30కు సంభవించింది. అలాస్కా ఖాతంలోని కోడియాక్ దీవికి ఆగ్నేయంగా 170 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపారు.