అంతర్జాతీయం

తాలిబన్‌ను కట్టడి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 23: ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పదే పదే ఉగ్రదాడులకు పాల్పడుతున్న తాలిబన్ నేతలను తక్షణం అరెస్టు చేయడమో లేదా బహిష్కరించడమో చేయాలని పాకిస్తాన్‌కు అమెరికా గట్టిగా సూచించింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఓ హోటల్‌పై ఉగ్రదాడి ఫలితంగా 22 మంది మరణించడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. కాబూల్ హోటల్‌లో 22 మంది మరణానికి తామే కారకులమంటూ తాలిబాన్లు ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్ష భవనం నుంచి ఓ ప్రకటన వెలువడింది. హోటల్‌లో జరిగిన మారణకాండలో 8మంది ఆఫ్ఘన్లతో పాటు 14 మంది విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. తాలిబన్లను తక్షణం కట్టడి చేసేందుకు, ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం ఇవ్వకుండా ఉండేందుకు పాకిస్తాన్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదుల దాడులతో నష్టపోతున్న ఆఫ్ఘనిస్తాన్‌కు తాము అన్ని విధాలా అండగా ఉంటామని, నరమేధంలో సాధారణ పౌరులు మరణించడం విచారకరమని ‘వైట్‌హౌస్’ మీడియా కార్యదర్శి సారా శాండర్స్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడే ఆఫ్ఘన్ సైనికులకు అమెరికా సహకరిస్తుందని ఆమె ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నిస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.