అంతర్జాతీయం

వాహ్వా.. భారత్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 24: భారత్‌పై చైనా సరికొత్త ప్రేమ ప్రదర్శించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అత్యద్భుతమంటూ ప్రశంసలు గుప్పించింది. ‘స్వదేశీ వస్తు రక్షితవాదం ఉగ్రవాదం కంటే మహా ప్రమాదం’ అంటూ మంగళవారం డబ్ల్యుఈఎఫ్ వేదికపై మోదీ చేసిన ప్రసంగం చైనాను ఆకట్టుకుంది. రక్షితవాదాన్ని వ్యతిరేకించడం చూస్తుంటే, గ్లోబలైజేషన్‌కు భారత్ మొగ్గు చూపడమేనని ప్రశంసలు కురిపించింది. ‘్భరత ప్రధాని మాటలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలకు చాలా దగ్గరగా ఉన్నాయి. స్వదేశీ వస్తు రక్షితవాదంపై యుద్ధం చేద్దామని పిలుపునివ్వడం చూస్తుంటే, ఇది గ్లోబలైజేషన్ ట్రెండేనని చెప్పకనే చెప్పారు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హ్యు చున్యింగ్ మీడియా వద్ద వ్యాఖ్యానించారు. గ్లోబలైజేషన్ ప్రక్రియను మరింత బలోపేతం చేయడానికి ప్రపంచ దేశాలు సహా భారత్‌తో కలిసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందన్నారు. ‘గ్లోబలైజేషన్, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి విషయంలో చైనా, భారత్‌ల ఆలోచనలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ విషయంలో భారత్‌కు మరింత సహకరించి, సమష్టిగా పని చేయడానికి చైనా ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు జరగాలన్నదే చైనా ఆకాంక్ష’ అని ఆమె వ్యాఖ్యానించారు. రక్షితవాదం పట్ల సారూప్య ఆసక్తి ప్రదర్శిస్తున్న భారత్, చైనాల మధ్య ఆ అంశం ద్వైపాక్షిక సంబంధాల మెరుగుకు ఉపకరిస్తుందా? అన్న ప్రశ్నకు ‘మావైపు మేం స్పష్టంగా ఉన్నాం. భారత్ మాకు అతిపెద్ద పొరుగు దేశం. అభివృద్ధి చెందుతున్న రెండు అతి పెద్ద పొరుగు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల మధ్య స్థిరమైన మైత్రినే కొనసాగిస్తాయని ఆశిస్తున్నాం’ అని చున్యింగ్ స్పష్టం చేశారు. ‘ఇరు దేశాల మధ్య తలెత్తిన చిన్నపాటి వ్యత్యాసాలను అధిగమించి, సారూప్య ఆసక్తుల మేరకు కలిసి పని చేయాలన్నదే చైనీయుల ఆకాంక్ష. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతానికి ఉపకరిస్తుందనే అనుకుంటున్నా’ అని చున్యింగ్ వ్యాఖ్యానించారు.