అంతర్జాతీయం

డ్రీమర్లకు ట్రంప్ అభయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 25: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని డ్రీమర్లకు ఊరట కలిగించే ప్రకటన చేశారు. డ్రీమర్లుగా పిలిచే అక్రమ వలసదారుల కోసం ఓ కార్యాచరణను రూపొందించనున్నట్టు గురువారం ఆయన వెల్లడించారు. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్ చట్టం తీసుకురానున్నామని ఆయన స్పష్టం చేశారు. రానున్న 12 ఏళ్లలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. ఈ నూతన ఇమ్మిగ్రేషన్ చట్టం ఉభయ సభల్లో ఆమోదం లభిస్తుందన్న ఆశాభావం వైట్‌హౌస్ వర్గాలు వ్యక్తం చేశాయ. అలాగే అమెరికా-మెక్సికో దేశాల సరిహద్దు కోసం 25 మిలియన్ డాలర్లు వెచ్చించనున్నామని అమెరికా వెల్లడించింది. కాగా డ్రీమర్ల కోసం కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టానికి ఆమోదం లభిస్తే వేలాది మంది భారతీయులకు ప్రయోజనం చేకూరుతుంది. అమెరికాలో మొత్తం 6,90,000 మంది అక్రమ వలసదారులున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నవారిని డ్రీమర్లుగా పిలుస్తారు. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించాలన్న ఉద్దేశంతో కొన్ని షరతులతో 2001లోనే ఓ ద్వైపాక్షిక చట్టాన్ని రూపొందించారు. అయితే ఆ బిల్లు ఇప్పటికీ వెలుగుచూడలేదు. ‘ఇప్పుడు ఆ చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులూ చేస్తున్నాం. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా దాన్ని రూపొందిస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తికావడానికి పది, పనె్నండేళ్లు పడుతుంది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ వైట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ జరుగుతోంది. ‘కష్టపడి పనిచేస్తున్న వలసవాదలకు ఇదో ప్రోత్సాహకం’ అంటూ ట్రంప్ అభివర్ణించారు. ఎలాంటి భయాందోళనకు గురికావద్దని వలసవాదులకు చెప్పండని అమెరికా అధ్యక్షుడు విజ్ఞప్తి చేశారు. ఇలా ఈ కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టానికి సంబంధించి తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని ఆయన అన్నారు.