అంతర్జాతీయం

మన అనుబంధం ఈనాటిది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, జనవరి 26: భారత్ - ఆసియాన్ దేశాల మధ్య ఎలాంటి విభేదాలు, వివాదాలు, ఆధిపత్య ధోరణులు లేకుండా సారభౌమత్వ సమానత్వంతోనే మైత్రీబంధం కొనసాగుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ వైశాల్యాలతో సంబంధం లేకుండా అన్ని విధాలుగా ఈ దేశాలు వ్యాపార, వాణిజ్యపరంగా సంధానమవుతున్నాయని పది ఆసియా దేశాలకు చెందిన పత్రికల్లో రాసిన ఆప్ ఎడ్ వ్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొత్తం 27 పత్రికల్లో పది భాషల్లో పది ఆసియా దేశాల్లో ఈ వ్యాసం ప్రచురింతమైంది. భారత గణతంత్ర దినోత్సవంతోపాటు ఆసియాన్ -్భరత్ స్మారక శిఖరాగ్ర సదస్సును పురస్కరించుకుని ఈ దేశాలతో భారత బంధాన్ని విశదీకరిస్తూ మోదీ ఈ వ్యాసం రాశారని విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి రవీష్‌కుమార్ తెలిపారు. ఉమ్మడి విలువలు, ఉమ్మడి గమ్యం అన్న శీర్షికతో ఈ వ్యాసం ప్రచురింతమైంది. ఆసియాన్ దేశాలైన థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేసియా, ఫిలప్పీన్స్, మలేసియా, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనీలతో భారత్ అనుంబంధాన్ని, దాని ప్రాముఖ్యతను ఈ వ్యాసంలో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ దేశాలతో భారత్ సంబంధాలు స్వేచ్ఛాయుతంగా ఎలాంటి అవరోధాలకు తావులేకుండా సాగుతున్నాయన్నారు. తమకు భవిష్యత్ పట్ల ఉమ్మడి దృక్ఫథం ఉందని, పరస్పర సార్వభౌమత్వ ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంతోపాటు వ్యాపార వాణిజ్యపరంగా ఎలాంటి ఒడిదుడుకులూ లేని మార్గాలను సుగమం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
ఆసియాన్ దేశాలతో భారత భాగస్వామ్యానికి పాతికేళ్లు పూరె్తైన సందర్భంగా ఈ దేశాలకు చెందిన నేతలతో స్మారక శిఖరాగ్ర సదస్సు నిర్వహించే గౌరవం తనకు దక్కిందని మోదీ తెలిపారు. ఈ పాతికేళ్ల ఘనమైన ప్రస్థానం ఓ చారిత్రక మైలురాయిని దాటినట్టయ్యిందని, మరింత విస్తృతస్థాయిలో భాగస్వామ్య బంధాన్ని పెంపొందించుకునేందుకు ఆస్కారం ఏర్పడిందన్నారు. దాదాపు 190 కోట్ల మంది ప్రజలతో కూడిన దేశాల మధ్య లోతైన భాగస్వామ్యం పెంపొందడం అంటే అదో చారిత్రక పరిణామమని స్పష్టం చేశారు. ఆసియాన్‌తో భారత భాగస్వామ్యానికి అధికారికంగా పాతికేళ్లు పూరె్తైనప్పటికీ, ఆగ్నేయ ఆసియా దేశాలతో భారత్ సంబంధాలు అనాదిగా కొనసాగుతూ వస్తున్నాయని తన వ్యాసంలో వివరించారు. శాంతి, సుహృద్భావం, మతం సంస్కృతి, కళలు, వాణిజ్యం, భాష, సాహిత్యం ఇలా భిన్నరంగాల్లో ఈ దేశాలతో భారత్ మమేకమైందని మోదీ తెలిపారు. భారతదేశ భిన్నత్వ సంస్కృతికి ఆగ్నేయాసియా దేశాల సమష్టి విస్తృతికి ఈ రకమైన సంధానత ప్రతి రంగంలోనూ ప్రస్ఫుటమవుతుందని తెలిపారు. అత్యంత విస్తృతస్థాయి సంస్కరణలు, మార్పులతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలుకుతూ భారత్ తన ద్వారాలు తెరిచిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.