అంతర్జాతీయం

11 దేశాల శరణార్థులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 30: ‘అత్యంత ప్రమాదకరమైన’ 11 దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలో ప్రవేశించడంపై అమలులో ఉన్న నిషేధాన్ని ట్రంప్ యంత్రాంగం రద్దు చేసింది. అయితే, శరణార్థుల ప్రవేశంపై ‘లోతైన పరిశీలన’ ఉంటుందని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. 11 దేశాల పేర్లను ప్రస్తావించక పోయినప్పటికీ వాటిలో ఉత్తర కొరియా, పది ముస్లిం దేశాల పేర్లు ఉన్నాయని సమాచారం. ఈ దేశాల నుంచి ‘ప్రమాదకరమైన అభ్యర్థనల’ను ఆమోదిస్తామని అమెరికా పేర్కొంది. తమ దేశంలోకి ఎవరెవరు ప్రవేశిస్తున్నారో అన్న అంశం చాలా కీలకమైనదని అమెరికా హోంలాండ్ కార్యదర్శి క్రిస్ట్‌జెన్ నీల్సన్ అన్నారు. శరణార్థుల ముసుగులో ఉన్న ప్రమాదకర శక్తులను ఏరివేసేందుకు, తమ దేశాన్ని పరిరక్షించుకునేందుకు ఇలాంటి చర్యలు అవసరమని అన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక మారిన శరణార్థుల విధానం మేరకు కొన్ని నిషేధాలను పాటిస్తున్నారు. అయితే ఏ దేశాల శరణార్థులు ప్రమాదకరమన్న విషయాన్ని స్పష్టంగా ప్రకటించకపోయినా, కొన్ని దేశాలను ‘ప్రమాదకరం’గా భావిస్తున్నారు. ఆ జాబితాలో ఈజిఫ్ట్, ఇరాన్, ఇరాక్, లిబియా, మాలి, ఉత్తర కొరియా, సోమాలియా, దక్షిణ సూడాన్, సిరియా, సూడాన్, యెమెన్ దేశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 2007లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా శరణార్థుల ప్రవేశానికి అనుమతి ఇచ్చారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో శరణార్థుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు.