అంతర్జాతీయం

అంబరవీధిలో అద్భుతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: ఆకాశవీధిలో బుధవారం రాత్రి అరుదైన అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పౌర్ణమి రోజున పండువెనె్నలను పంచే చంద్రుడు మూడు రంగుల్లో దర్శనం ఇచ్చి వీక్షకులకు కనువిందు చేశాడు.. మరపురాని మధురానుభూతిని మిగిల్చాడు.. ‘సూపర్ మూన్’, ‘బ్లడ్ మూన్’, ‘బ్లూ మూన్’ల పేరిట చంద్రుడు త్రిపాత్రాభినయం చేశాడు. అంబర వీధిలో ఈ ఘట్టాన్ని ‘సూపర్ బ్లూ బ్లడ్ మూన్’గా శాస్తవ్రేత్తలు అభివర్ణించారు. 1982లో ఇలాంటి పరిణామం చోటుచేసుకుందని, మరలా 2037 వరకూ ఇలాంటి సందర్భం రాదని వారు తెలిపారు. భ్రమణ సమయంలో భూమికి చేరువగా వచ్చినపుడు సంభవించే పున్నమిని ‘సూపర్ మూన్’గా పిలుస్తారు. ఈ సమయంలో చంద్రుడు సాధారణ పౌర్ణమి నాడు కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈ ఘట్టాన్ని స్పష్టంగా వీక్షించే అవకాశం ఉత్తర అమెరికా, తూర్పు ఆసియా వాసులకు దక్కింది. చంద్ర గ్రహణం సందర్భంగా ఆవిష్కృతమైన ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించి భారత్ సహా అనేక దేశాల్లో జనం మైమరచిపోయారు.