అంతర్జాతీయం

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక విమానం నుంచి, జూన్ 18: పౌర అణు ఇంధన రంగంలో ఘనాకు పూర్తిస్థాయిలో సహకరించడానికి భారత్ అంగీకరించింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆఫ్రికా దేశాల్లో ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగించుని తిరిగివస్తూ ప్రత్యేక విమానంలో మీడియాతో ముచ్చటించారు. పౌర అణు ఇంధన రంగంలో సహాయ, సహకారాలు అందించే అంశాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అణు సాంకేతిక సహకారం, ముడిసరుకు లభ్యత, యురేనియం సరఫరా వంటి అంశాలతో చర్చించినట్టు ప్రణబ్ స్పష్టం చేశారు. ఘనా, కోట్ డిల్‌వొయిర్, నమీబియాలో తన పర్యటన విజయవంతం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఐరాసా భద్రతా మండలిలో తక్షణం సంస్కరణలు జరపాలన్న భారత్ డిమాండ్‌కు మూడు దేశాల నుంచి మద్దతు లభించిందని తెలిపారు. అలాగే ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం సంస్కరణలు తీసుకురావాలని మూడు దేశాల అధినేతలు కోరాయి. అంతర్జాతీయ ఉగ్రవాదం వల్ల పౌర సమాజానికి ఎదురవుతున్న సవాళ్లు, ముప్పుపై రాష్టప్రతి ప్రణబ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదం మంచిదా, చెడ్డదా అన్న చర్చను పక్కనబెట్టి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఉమ్మడిగా పోరాడాలని ఆఫ్రికా దేశాలకు ప్రణబ్ పిలుపునిచ్చారు. యురేనియం సరఫరా, అణు ఇంధన రంగంలో సహకరించడానికి నమీబియా ముందుకొచ్చింది. యురేనియ సరఫరాకు సంబంధించి ఆ దేశంలో ఒప్పందం చేసుకున్నట్టు రాష్టప్రతి ప్రకటించారు. మాజీ అధ్యక్షుడితో చేసుకున్న ఒప్పందంపై ఏమైనా సమస్యలు ఉంటే ఇరుదేశాల సాంకేతిక నిపుణులతో చర్చించుకోవాలని నిర్ణయించారు.