అంతర్జాతీయం

మేథోసంపత్తి సూచికలో మెరుగుపడిన ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 8: అంతర్జాతీయ మేదోసంపత్తి సూచిక (ఇంటలెక్చ్యువల్ ప్రాపర్టీ-ఐపీ)లో భారత్ తన స్థానాన్ని గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపరుచుకుంది. ఈ విషయంలో తొలి యాబయి ర్యాంకులు సాధించిన దేశాల్లో భారత్‌కు 44వ స్థానం లభించింది. గత ఏడాది ఈ ర్యాంకులు పొందిన తొలి 45 దేశాల్లో భారత్ 43వ స్థానంలో నిలవగా ఇప్పుడు తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుంది. అయితే మరింత మెరుగైన ర్యాంకు సాధించడానికి భారత్ తన విధానాల్లో అదనపు, అర్థవంతమైన సంస్కరణలు అమలు చేయాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచికలో ర్యాంకులు సాధించిన 50 దేశాల జాబితాతో కూడిన వార్షిక నివేదికను ఆ సంస్థకు చెందిన గ్లోబల్ ఇన్నోవేషన్ పోలసీ సెంటర్ (జీఐపీసీ) రూపొందించింది. ఇప్పుడు విడుదల చేసిన ఆ నివేదిక ఆరవది. ప్రపంచంలో 50 దేశాల ఆర్థిక వ్యవస్థల్లో నవకల్పనలు, సరికొత్త ఆవిష్కరణలు, సంస్కరణలు, మేధోసంపత్తి హక్కులు, చట్టాలు, సాంకేతిక అంశాలు, ఫలితాల ఆధారంగా ఈ ర్యాంకులు ప్రకటిస్తారు. మేధోసంపత్తిలో ర్యాంకును మెరుగుపరుచుకున్నప్పటికీ భారత్ ఆ జాబితాలో ఇంకా అట్టడుగునే ఉన్న విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ‘మొత్తంమీద చూస్తే భారత్ 5వ నివేదికలో 25 శాతం స్కోరు సాధించగా ఇప్పుడు ఆరవ నివేదికలో గణనీయంగా స్కోరును 30 శాతానికి పెంచుకుంది’ అని ఆ నివేదికలో పేర్కొన్నారు. కంప్యూటర్ ఆధారిత నవకల్పనలు, సానుకూల సంస్కరణల వల్ల భారత్ ఈ ఫలితాలు సాధించింది. 37.98 పాయింట్లతో అమెరికా తొలిస్థానంలోను, 37.97 పాయింట్లతో రెండోస్థానంలోను, 37.03 పాయింట్లతో స్వీడన్ మూడో స్థానంలోను నిలిచాయి. కంప్యూటర్ ఆధారిత ఆవిష్కరణల పరీక్షా విధానాల మార్గదర్శకాలను మారుస్తూ భారత్ గత జూలైలో తీసుకున్న చర్యల వల్ల సాంకేతిక నవకల్పనలు సాధ్యమయ్యాయని, అందువల్ల తన ర్యాంకును మెరుగుపరుచుకోగలిగిందని ఆ నివేదిక స్పష్టం చేసింది. జాతీయ మేధోసంపత్తి హక్కుల విధానాల్లో మార్పులు చేస్తూ ఈ విషయంలో వర్క్‌షాప్‌లు, సాంకేతిక శిక్షణ, సెమినార్లు, చర్చాగోష్టుల వంటివి ప్రభుత్వం చేపట్టడం కూడా ఇందుకు దోహదపడింది. మేధోసంపత్తి ర్యాంకును మెరుగుపరుచుకోవడంలో భారత్ తొలిసారిగా కొన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమించింది, అయినా ఇంకా సాధించాల్సినది చాలా ఉందని, చాలా దేశాలకన్నా వెనుకబడే ఉందని జీఐపీసీ ఉపాధ్యక్షుడు పాట్రిక్ కిల్‌బ్రిడే పేర్కొన్నారు.