అంతర్జాతీయం

దక్షిణాఫ్రికాలో రాజకీయ ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహనె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 10: దక్షిణాఫ్రికాలో రాజకీయ ప్రతిష్ఠంభన ఇంకా కొనసాగుతోంది. సొంత పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పదవినుండి వైదొలగాలని కోరినప్పటికీ దేశాధ్యక్షుడు జాకబ్‌జుమా పదవిని పట్టుకుని వేళ్లాడుతూండటంతో ఆయనను సాగనంపే ప్రయత్నాలు ఇంకా ఫలితాన్ని ఇవ్వలేదు. పదవినుంచి వైదొలిగే విషయంలో జాకబ్‌జుమాతో జరుపుతున్న చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. ఒకటి రెండురోజుల్లో చర్చలు పూర్తవుతాయని కాబోయే అధ్యక్షుడు సైరిల్ రమఫొసా, ఏఎన్‌సీ ప్రకటించినప్పటికీ జుమా వైదొలిగే విషయంపై ఎటువంటి సమాచారమూ లేదు. పార్లమెంటులో గురువారంనాడు జాతినుద్దేశించి ప్రసంగించే పనితో సహా అన్ని కార్యక్రమాలను జుమా రద్దు చేసుకున్నారు. కాగా నెల్సన్‌మండేలా శతజయంతి, 1990లో జైలునుంచి మండేలా విడుదలకు గుర్తుగా ఆదివారంనాడు జరిగే కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమఫొసా ప్రసంగించవలసి ఉంది.
కాగా పదవినుంచి వైదొలగే విషయంలో అధ్యక్షుడు జుమా, ఉపాధ్యక్షుడు రమఫొసా మధ్య మరో రెండు రోజుల్లో ముగుస్తాయని, చర్చల ఫలితాన్ని జాతికి ఆ తరువాత వెల్లడిస్తారని తెలుస్తోంది. అయితే పదవినుండి తప్పుకునేందుకు జుమా అంత సులువుగా ఒప్పుకోరని, కడదాకా పోరాడతారని రాజకీయ ప్రముఖులు, విశే్లషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్ఠంభన మరికొన్ని రోజులు కొనసాగవచ్చునని వారు అంచనావేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక క్రిమినల్ కేసులు పదవినుంచి వైదొలగితే పీకకు చుట్టుకుంటాయన్న కారణంగా ఆయన భీష్మించుకు కూర్చున్నారని భావిస్తున్నారు.