అంతర్జాతీయం

ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేసిన ఇజ్రాయెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలేం, ఫిబ్రవరి 10: ఇరాన్‌కు చెందిన డ్రోన్ ఒకటి ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించడంతో ఇజ్రాయెల్ దానిని కూల్చివేసింది. సిరియాలో దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ దళాలు సన్నద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తమ సారభౌమాధికారానికి భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ ఉపేక్షించేది లేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పింది. ఇలావుండగా సిరియాపై దాడులు చేసి తిరిగివస్తున్న సమయంలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16ను యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిసైళ్లు ఢీకొనడంతో ఒక పైలట్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో పైలెట్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 2011 నుంచి సిరియాలోని రెబెల్స్ దళాలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వస్తోందని, ఇలా ఇరాన్ ద్రోణులు తమ భూభాగంలోకి చొచ్చుకు రావడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ రోనెన్ మనేలెస్ తెలిపారు.
ఈ చర్యకు బాధ్యులైనవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ శాఖ మంత్రి అవిగ్డర్ లీబర్‌మన్ టెల్‌అవీవ్‌లోని మిలిటరీ హెడ్‌క్వార్టర్స్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. లెబనాన్ యుద్ధం 1982 నుంచీ జరుగుతోందని అయితే ఎఫ్-16 విమానాన్ని కూల్చివేయడం ఇదే మొదటిసారి ఇజ్రాయెల్ సైనికాధికారి ఒకరు తెలిపారు.

చిత్రం..సిరియాపై దాడి చేసి తిరిగివస్తూ కూలిపోయన ఇజ్రాయెల్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం