అంతర్జాతీయం

ఒమన్‌తో మరింత మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మస్కట్, ఫిబ్రవరి 12: భారత్ ఒమన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అన్ని అంశాల్లోనూ బలమైన సంబంధాలకు తన పర్యటన పునాది అవుతుందన్న ధీమాను భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఒమన్ అగ్రనాయకత్వంతో తాను జరిపిన చర్చలు ఇందుకు పూర్తిస్థాయిలో దోహదం చేయగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పర్యటన తనకు చిరస్మరణీయ స్మృతిగా మిగిలిపోతుందని తన రెండు రోజుల ఒమన్ పర్యటన ముగింపు సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా రక్షణ సహకారంతోపాటు మొత్తం ఎనిమిది రంగాల్లో పరస్పర సహకారానికి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ రెండు దేశాల ప్రజల మధ్య శతాబ్దాలుగావున్న మైత్రీబంధానికి తన పర్యటన మరింత ఊతాన్నిచ్చిందని, కచ్చితంగా రానున్న రోజుల్లో అన్ని రంగాల్లోనూ విస్తృతస్థాయి సహకారానికి దోహదం చేస్తుందని మోదీ అన్నారు. వ్యాపార, వాణిజ్య పెట్టుబడులతోపాటు ఇరుదేశాల మధ్య సహకారం మరింతగా విస్తరించడానికి ఎంతో అవకాశం ఉందని తెలిపారు. ‘నా పర్యటన సందర్భంగా కనబర్చిన ఆత్మీయత, అనురాగం, గౌరవం, స్నేహానికి కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని ఒమన్ సుల్తాన్ ఖబూస్‌ను ఉద్దేశించి మోదీ అన్నారు. అలాగే ‘మీరు కనబర్చిన వ్యక్తిగత ఆసక్తి ననె్నంతగానో ఆకర్షించింది. అందుకే నా పర్యటన చిరస్మరణీయంగా మిగిలిపోతుంది’ అని మోదీ పేర్కొన్నారు. భారత్‌పట్ల ఒమన్ సుల్తాన్, ఆ దేశ ప్రజలు కనబర్చిన సుహృద్భావం, ఆత్మీయత, మద్దతుపట్ల కూడా మోదీ కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ, ఒమన్, పాలస్తీనాల పర్యటన ముగించుకున్న మోదీ తన తుది పర్యటనలో భాగంగా దుబాయ్ చేరుకున్నారు. సుల్తాన్ కబూస్‌తో అనేకాంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. మైత్రీబంధాన్ని బలోపేతం చేయడంతోపాటు అన్ని రంగాల్లోనూ పరస్పర సహకారాన్ని ఏవిధంగా విస్తరించుకోవాలన్న దానిపై ఒమన్ అధినేతతో మోదీ చర్చించారని అధికార ఒమన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వ్యాపార, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ, భద్రత, ఆహార భద్రతతోపాటు అనేక ప్రాంతీయ అంశాలపైన కూడా లోతైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ తెలిపారు. ఒమన్ అభివృద్ధిలో భారత్ ప్రజల కృషి, పట్టుదల ఎంతో ఉందని సుల్తాన్ కబూస్ ప్రశంసించారని ఆయన తెలిపారు. అధినేతల చర్చల అనంతరం న్యాయ, పౌర, వాణిజ్య అంశాలపై న్యాయ సహకారంతోపాటు ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయన్నారు. అలాగే దౌత్యంతోపాటు ఇతర ప్రత్యేక సేవలకు సంబంధించిన, రాకపోకల విషయంలో వీసాల మినహాయింపుపై కూడా ఒప్పందం కుదిరిందని తెలిపారు. అలాగే ఆరోగ్యం, టూరిజంతోపాటు రోదశిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించుకునే అంశంపై కూడా సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

చిత్రాలు..మస్కట్‌లో సోమవారం సుల్తాన్ కబూస్ గ్రాండ్ మసీదును సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ