అంతర్జాతీయం

చైనాలో యోగాపై ప్రత్యేక కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూన్ 18: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు చైనాలో పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. బీజింగ్‌లోని ఛాయాంగ్ పార్క్‌లో భారత రాయబార కార్యాలయం సహకారంతో ‘యోగి యోగ’ సంస్థ నిర్వహించిన యోగా శిక్షణ శిబిరానికి పెద్దసంఖ్యలో స్థానికులు తరలివచ్చారు. అలాగే భారత రాయబార కార్యాలయంలో ‘పివి యోగ’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో యోగా శిక్షణతోపాటు భారతీయ నృత్యం, సంగీతం అంశాలను కూడా ప్రదర్శించారు. భారతీయ వంటకాలతోపాటు దుస్తులను ఆయా శిబిరాల్లో ప్రదర్శించారు.

చిత్రం బీజింగ్‌లోని ఛాయాంగ్ పార్క్‌లో నిర్వహించిన యోగా శిక్షణలో పాల్గొన్న చైనీయులు