అంతర్జాతీయం

అమెరికాలో నరమేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 15:అమెరికాలో తుపాకుల సంస్కృతి మరోసారి మారణహోమం సృష్టించింది. తనను పాఠశాల నుంచి బహిష్కరించారన్న అక్కసుతో తొమ్మిదవ తరగతి చదువుతున్న మాజీ విద్యార్థి నికోలస్ క్రుజ్ (19) తోటి విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 17మంది మరణించగా పెద్దసంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. ఫ్లోరిడాలో పార్క్‌లాండ్ మార్జొరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో బుధవారం ఈ దారుణం చోటుచేసుకుంది. గాయపడినవారిలో భారత సంతతికి చెందిన విద్యార్థి ఒకరు ఉన్నారు.
నిజానికి ఈ పాఠశాలలో చదివే విద్యార్థులలో భారత సంతతికి చెందివారు ఎక్కువగా ఉన్నారు. కాల్పులకు తెగబడిన విద్యార్థి క్రుజ్‌ను పోలీసులు సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. ‘హంతకుడు క్రుజ్‌కు చెందిన వెబ్‌సైట్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేశామని, అందులోని అంశాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయని’ బ్రోవర్డ్ కౌంటీ షరీఫ్ స్కాట్ ఇజ్రాయిల్ విలేకరులకు తెలిపారు. కాల్పులకు తెగబడటానికి కొద్దిసేపు ముందు క్రుజ్ భయంగొలిపే సామాగ్రిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఏఆర్-15 రైఫిల్‌తో సహా లెక్కలేనన్ని మ్యాగజైన్స్, స్మోక్ గ్రెనేడ్స్, గ్యాస్‌మాస్క్ అతడి వద్ద లభించాయని స్కాట్ చెప్పారు. చాలాకాలంగా అల్లరిపనులతో విసిగించిన నికోలస్ క్రుజ్ గత ఏడాది తన మాజీ ప్రియురాలి కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ఘర్షణ పడటంతో స్కూల్ యాజమాన్యం గత ఏడాది అతడిపై క్రమశిక్షణ చర్య తీసుకుంది. పాఠశాల నుంచి బహిష్కరించింది. దీంతో కక్ష పెంచుకున్న నికోలస్ బుధవారం నాడు కాల్పులకు తెగబడ్డాడు. మొదట స్కూల్ ఆవరణలోకి వచ్చిన అతడు ఫైర్ అలారమ్ మోగించి విద్యార్థులంతా తరగతి గదులనుంచి బయటకు వచ్చేలా చేశాడు. ఆ తరువాత అతి దగ్గరనుంచి కాల్పులు జరిపాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు విద్యార్థినీవిద్యార్థులు తలోవైపు పరుగులుపెట్టారు. అయినా అతడు కాల్పులు ఆపలేదు. ఈ కాల్పుల్లో 12మంది అక్కడకికక్కడే మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్ప్రత్రిలో మరో ఐదుగురు మరణించారు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించలేదు. కాగా 2012లో కనెక్టికట్ స్కూల్ శాండీ హుక్‌లో జరిగిన కాల్పుల్లో 26 మృతిచెందిన సంఘటన తరువాత అమెరికాలో జరిగిన అతిపెద్ద సామూహిక మారణకాండ ఇదే.
ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో స్థానిక పోలీసులకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్ సహకరిస్తోంది. మరోవైపు ఈ సంఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘్ఫ్లరిడా కాల్పులు అతి భయంకరమైనవి. బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నాను’ అని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఫ్లోరిడాలోని టీచర్లు, విద్యార్థులే కాదు, ప్రతి ఒక్కరూ అమెరికా పాఠశాలల్లో భద్రత లేదని భావిస్తున్నారని కూడా ఆయన ట్వీట్ చేశారు. కాగా అమెరికాలో ఈ ఏడాది స్కూళ్లలో జరిగిన కాల్పుల సంఘటనల్లో ఇది 18వదని, తాజా సంఘటనతో మళ్లీ తుపాకుల సంస్కృతిపై చర్చ మొదలవుతుందని ఫ్లోరిడా సెనేటర్ క్రిస్ మర్ఫీ అన్నారు.

చిత్రాలు..ఫ్లోరిడాలో కాల్పుల అనంతర దృశ్యాలు