అంతర్జాతీయం

ఇమ్రాన్ మూడో పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఫిబ్రవరి 19: పాకిస్తాన్ తెహ్రిక్ -ఇ- ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నట్టు ఆ పార్టీ నిర్థారించింది. మత బోధనలు చేసే బుష్రా మనేకాను ఇమ్రాన్ వివాహమాడినట్టు పార్టీ వర్గాల నిర్దారించటంతో, కొద్ది రోజులుగా సాగుతున్న కథనాలకు తెరపడినట్టయ్యింది. బుష్రా బీబీ (పింకీ పిర్)ని పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఆదివారం పెళ్లి చేసుకున్నారు అని పీటీఐ అధికార ప్రతినిథి ఫవాద్ చౌదరి ఒక ట్వీట్‌లో వెల్లడించారు. లాహోర్‌లోని మనేకా సోదరుని నివాసంలో అతి సాధారణంగా వివాహ తంతు ముగిసిందని వెల్లడించారు. పీటీసీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు ముఫ్తీ మహ్మద్ సరుూద్ దగ్గరుండి నిఖాను పూర్తి చేయించారని చౌదరి తన ట్వీట్‌లో పేర్కొంటూ ఇమ్రాన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల్లోనే అతి సాధారణ స్థాయిలో వలిమా కార్యక్రమం కూడా నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. ఇమ్రాన్ మూడో పెళ్లికి సంబంధించి చిత్రాలను పీటీఐ మీడియా విడుదల చేసింది. అక్కచెల్లెళ్లను ఇమ్రాన్ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడంతో, వాళ్లెవరూ నిఖాకు హాజరు కాలేదన్న కథనాలు బలంగా వినిపిస్తున్నాయి. 1995లో బ్రిటీష్ కోటీశ్వరుని కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడిన ఇమ్రాన్ తొమ్మిదేళ్లు ఆమెతో కలిసుండి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆమెనుంచి విడాకులు తీసుకున్న చాలాకాలం తరువాత 2015లో టీవీ యాంకర్ రెహమ్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. పది నెలల కాలంలోనే ఆమెతో ఇమ్రాన్ తెగతెంపులు చేసుకున్నారు. తాజాగా బుష్రా మనేకాను పెళ్లాడారు. ఈ ఏడాది ఆరంభం జనవరి 1న మనేకాను ఇమ్రాన్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నారంటూ కొద్దిరోజులుగా వెలువడుతున్న కథనాలను ఇమ్రాన్ కొట్టివేయడం తెలిసిందే.