అంతర్జాతీయం

ఖర్చు మనది.. లబ్ది వారిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 24: పర్యావరణ సమతూకాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడానికి కారణం భారత్, చైనాలేనంటూ ఆ దేశ అధ్యయుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా అన్ని విధాలుగా నష్టపోవడమే కాకుండా, దానివల్ల లబ్దిపొందుతున్న దేశాల భారాన్ని కూడా మోయాల్సిన పరిస్థితి తలెత్తిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోకుండా ఉండివుంటే ఇతర దేశాల భారాన్ని, వ్యయాలనూ తామే భరించి ఉండాల్సిన పరిస్థితి తలెత్తేదన్నారు. ఆ ఒప్పందంలో అమెరికా భాగస్వామిగా కొనసాగివుంటే ట్రిలియన్లకోద్దీ డాలర్ల ఖర్చు భరించాల్సి వచ్చేదని, అలాగే ఉపాధి అవకాశాలను నష్టపోవాల్సి వచ్చేదని, అన్నింటికీ మించి చమురు, సహజవాయువు, బొగ్గు, ఇతర ఉత్పాదక పరిశ్రమల పరింగానూ భారీ నష్టాన్ని అమెరికా చవిచూడాల్సి వచ్చేదని తెలిపారు. 200లకు పైగా దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని పునఃస్సమీక్షించుకునేందుకు ఒక దశలో ట్రంప్ మనసు మార్చుకుని ముందుకొచ్చిన విషయమూ ఈ సందర్భంగా గమనార్హం. అయితే, తాజాగా కన్జర్వేటివ్ పార్టీ రాజకీయ కార్యాచరణ కమిటీని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ ‘మొత్తానికి ఆ ఒప్పందం నుంచి అమెరికా బయటపడింది. అందులోనే కొనసాగివుంటే అది అమెరికాకు ఓ విపత్తే అయివుండేది’ అని స్పష్టం చేశారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం వల్ల భారత్, చైనావంటి దేశాలే అత్యధికంగా లబ్దిపొందుతున్నాయని పేర్కొన్నారు. పారిస్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవడం అన్నది అన్నివిధాలుగా సమర్థనీయమని ట్రంప్ పునరుద్ఘాటించారు. ‘మనకు అపారమైన పరిమాణంలో చమురు, సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. మనం రూపొందించుకున్న టెక్నాలజీ ఒక అద్భుతం. గతంలో ఎవ్వరూ ఎన్నడూ కనిపెట్టలేని ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చాం. అన్నింటికీమించి అమెరికాకు ఉన్న ఇంధన నిల్వలు అపారం’ అని అన్నారు. అయితే వీటన్నింటినీ ఉపయోగించుకోకూడదన్నది పారిస్ ఒప్పంద ఉద్దేశంగా మారిందని పేర్కొన్న ఆయన, అదే జరిగితే ఇతర దేశాలతో ఏమాత్రం పోటీపడలేని పరిస్థితిని అమెరికా ఎదుర్కోవాల్సి వచ్చేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితి ఎన్నడూ తలెత్తదని, పారిస్ ఒప్పందం విషయంలో తనపై వత్తిడి తెచ్చిన వారికి స్పష్టం చేశానని గుర్తు చేశారు. చైనా చేస్తున్న వాదన 2030 వరకూ పని చేసే పరిస్థితి లేదని, కానీ అమెరికా వాదనవల్ల తక్షణ ప్రయోజనాలు చేకూరతాయని ట్రంప్ అన్నారు. భారత్, చైనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలంటూ బలమైన వాదనే వినిపిస్తున్నారని పేర్కొన్న ట్రంప్, ఇవేవీ ఉపయోగించకుండా ఉండివుంటే అమెరికా సంగతేమిటని ప్రశ్నించారు. పారిస్ ఒప్పందం, దాని లక్ష్యాల గురించి వింటే చాలా గొప్పగా ఉంటాయని పేర్కొన్న ట్రంప్, గుడ్డిగా ఈ ఒప్పందంలోనే కొనసాగివుంటే ‘నన్ను చంపేసి ఉండేవారే’ అని అన్నారు.

చిత్రం..అమెరికా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ దంపతులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు