అంతర్జాతీయం

23 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, ఫిబ్రవరి 24: ఆఫ్గానిస్తాన్ శనివారం ఆత్మాహుతి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఆత్మాహుతి దాడుల్లో కనీసం 23 మంది మరణించారు. డజన్లకొద్దీ గాయపడ్డారు. పశ్చిమ రాష్టమ్రైన ఫరాలో సైనిక శిబిరంపై తాలిబన్ మూకలు తెగబడ్డాయి. దాడుల్లో 18 మంది సైనికులు మృతిచెందారు. ‘్ఫరా రాష్ట్రంలోని బాలాబులక్ జిల్లాలో మిలిటెంట్ల గుంపు సైనిక శిబిరంపై మెరుపుదాడి చేసింది. ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 18 మంది సైనికులు చనిపోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఆ ప్రాంతానికి మరిన్ని బలగాలను పంపాం’ అని రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి దౌలత్ వజీర్ వెల్లడించారు. దాడికి పాల్పడింది తామేనని తాలిబన్ ప్రకటించుకుంది. బాలాబులుక్‌కు బలగాలతోపాటు నిజనిర్థారణ కమిటీని పంపినట్టు డిప్యూటీ గవర్నర్ యూనుస్ రసూలీ చెప్పారు. అలాగే రాజధాని కాబూల్‌లో దౌత్యవేత్తలు నివసించే ప్రాంతంలో ఉదయం రద్దీగా ఉండే సమయంలో ఆత్మాహుతి మానవ బాంబు పేలింది. ఈ దాడిలో ముగ్గురు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారని రసూలీ తెలిపారు. ‘ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మానవ బాంబు నడుచుకుంటూ వచ్చాడు. ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఇన్‌షర్ట్, టై కట్టుకుని మరీ వచ్చాడు. చెక్‌పాయింట్ వద్ద మిలిటెంట్ అని గుర్తించగా వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందారు’ అని అంతరంగిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి నస్రాత్ రహీమీ వెల్లడించారు. నేషనల్ డైరక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రాంగణం సమీపంలోనే ఆ ఘాతుకం జరిగింది. ఎన్‌డీఎస్ సమీపంలోనే నాటో ప్రధాన కార్యాలయం, యుఎస్ ఎంబసీ ఉన్నాయి.

చిత్రం..ఫరాలో సైనిక శిబిరంపై తాలిబన్ల దాడి అనంతరం బందోబస్తు ముమ్మరం చేసిన దృశ్యం