అంతర్జాతీయం

భారత్ సభ్యత్వానికి మద్దతివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 21: అణు సరఫరా దేశాల కూటమి (ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్యత్వాన్ని చైనా వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా తాజాగా ఎన్‌ఎస్‌జిలో చేరడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి మద్దతు ప్రకటించడమే కాకుండా సియోల్‌లో జరుగుతున్న ఎన్‌ఎస్‌జి ప్లీనరీలో భారత్ సభ్యత్వానికి మద్దతు ప్రకటించాలని ఎన్‌ఎస్‌జి సభ్య దేశాలను కోరింది. ‘ఎన్‌ఎస్‌జి సభ్యత్వానికి భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం, కొంతకాలంగా అమెరికా విధానం కూడా అదే. అందువల్ల ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశంలో పాల్గొంటున్న సభ్య దేశాల ప్రభుత్వాన్నిటినీ భారత్ దరఖాస్తుకు మద్దతు తెలపాలని కోరుతున్నాం’ అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ ఇక్కడ విలేఖరులతో అన్నారు. అంతేకాకుండా గ్రూపులోకి ఏ దరఖాస్తునైనా చేర్చుకోవాలంటే సభ్య దేశాల ప్రభుత్వాలన్నీ కూడా ఒక ఏకాభిప్రాయానికి రావలసిన అవసరం ఉంది. భారత్‌ను సభ్యదేశంగా చేర్చుకోవాలని అమెరికా తప్పకుండా అన్ని దేశాలను కోరుతుందని కూడా ఆయన అన్నారు. అణు సరఫరా దేశాల కూటమి అయిదు రోజుల సమావేశాలు సోమవారం సియోల్‌లో ప్రారంభమైన విషయం తెలిసిందే. భారత్‌లాంటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని దేశాలు ఎన్‌ఎస్‌జిలో సభ్యులు కావడంపై కూటమిలోని దేశాలు రెండుగా చీలిపోయి ఉన్నాయి. ఎన్‌ఎస్‌జిలో భారత్ ప్రవేశానికి మద్దతు ఇచ్చేలా చైనాను ఒప్పించగలమన్న ధీమాను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ వ్యక్తం చేసిన 24 గంటలకే చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.