అంతర్జాతీయం

భారత్-చైనా ఒక్కటయితే 1+1=11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 8: భారత్-చైనా దేశాలు తమ విభేదాలను పక్కనపెట్టి ద్వైపాక్షిక సంబంధాల విస్తృతికి కృషి చేయాలని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈ గురువారం కోరారు. పరస్పర రాజకీయ విశ్వాసంతో అడుగులు ముందుకేస్తే హిమాలయాలు కూడా ఇద్దరి మైత్రిని ఆపలేవన్నారు. డ్రాగన్-ఏనుగు పరస్పరం నృత్యం చేయాలి తప్ప కొట్లాడకూడదన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఏర్పాటు చేసిన వార్షిక విలేఖరుల సమావేశంలో వాంగ్ భారత్-చైనా సంబంధాలపై మాట్లాడారు. 2017లో డోక్లాం ప్రతిష్ఠంభనతో సహా పలు సమస్యల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు ఇబ్బందుల్లో పడిన నేపథ్యంలో చైనా, భారత్‌తో సంబంధాలను ఏ దృష్టితో చూస్తున్నదంటూ అడిగిన ప్రశ్నకు, ‘‘కొన్ని ఇబ్బందులు, పరీక్షలు ఎదురైనప్పటికీ రెండు దేశాల సంబంధాలు పురోగతిలోనే సాగుతున్నాయి’’ అని సమాధానమిచ్చారు.
చైనా-పాకిస్తాన్ ఆర్థిక నడవా (ఎకనామిక్ కారిడార్), పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఐరాస చేర్చకుండా అడ్డుకోవడం, భారత్ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపులో సభ్యత్వం పొందకుండా నిరోధించడం వంటి సమస్యలు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. డోక్లామ్‌లో భారత్-చైనా సైన్యాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్ఠంభన కొనసాగింది. చికెన్ నెక్ కారిడార్‌కు సమీపంలో భూటాన్ తనదిగా పేర్కొంటున్న ప్రదేశంలో రోడ్డు నిర్మాణాన్ని చైనా సైన్యం ఆపిన తర్వాత మాత్రమే ఈ ప్రతిష్ఠంభన ముగిసింది.
చైనా తన హక్కులను, చట్టబద్ధమైన ప్రయోజనాలపై రాజీ పడకుండానే, భారత్‌తో సంబంధాలను కొనసాగించడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాల భవితవ్యంపై, ఇరు దేశాల నాయకులు వ్యూహాత్మక దృక్కోణాన్ని అనుసరిస్తున్నారన్నారు. భారత్-చైనా ఒక్కటయితే 1+1, 11గా మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో రెండు దేశాల పరస్పర అపనమ్మకాలను విడనాడి పరస్పర విశ్వాసంతో మందుకు వెళ్లాలన్నారు. విశ్వాసానికి మించిన విలువైన వస్తువు మరోటి లేదన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న సంప్రదాయిక స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చైనా సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు అనుసరిస్తున్న ఇండో-పసిఫిక్ వ్యూహం, చైనా బెల్ట్ అండ్ రోడ్ (బిఆర్‌ఐ) కార్యక్రమానికి ఇబ్బంది కలిగిస్తుందా? అన్న ప్రశ్నకు ఆయన తీవ్రంగా స్పందించారు. ‘‘పతాక శీర్షికలకోసం ఇంతకు మించిన వార్తలు లేవా? అటువంటివన్నీ సముద్రంలో నురగలాంటివి, వాటికవే సమసిపోతాయి’’ అన్నారు. బిఆర్‌ఐ ప్రాజెక్టుకు మొత్తం వంద దేశాలు మద్దతిచ్చాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. బిఆర్‌ఐ జిన్‌పింగ్ మహదాశయంతో చేపట్టిన ప్రాజెక్టు. ఇది ఆసియా, ఆఫ్రికా, చైనా, యూరప్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుందన్నారు. కాగా బిఆర్‌ఐ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతున్న నేపథ్యంలో భారత్ ఇందుకు అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే.

చిత్రం..చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి