అంతర్జాతీయం

ఫ్లోరిడాలో ఆయుధ చట్టంలో మార్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మియామి, మార్చి 10: ఆయుధాల ధరించే విషయంలో కొన్ని నియంత్రణలు విధించే బిల్లుపై ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ సంతకం చేయడంతో, అమెరికాలో తుపాకి సంస్కృతికి కొంతమేర కట్టడి చేయడానికి అడుగు ముందుకు పడిందని చెప్పవచ్చు. దీనికి పార్క్‌లాండ్ కాల్పుల్లో మృతిచెందిన వారి బంధువులనుంచి పూర్తి మద్దతు లభించింది. అమెరికాలో తుపాకీ సంస్కృతిని నియంత్రించడానికి ఏ ప్రభుత్వమైనా వెనకాడుతుతుంది. ప్రభుత్వాలపై నేషనల్ రైఫిల్ అసోసియేషన్ లాబీ ప్రభావం స్థాయి అటువంటిది మరి. ఫ్లోరిడా లెజిస్లేచర్ ఈ బిల్లును ఆమోదించడానికి మూడువారాలపాటు ఎడతెగకుండా చర్చించడానికి ప్రధాన కారణం ఇదే. శుక్రవారం వరకు ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ఈ బిల్లుపై సంతకం చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు ఆయన దీనిపై తన ఆమోదముద్రవేయడంలో కథ సుఖాంతమైంది.
ఈ చట్టం ప్రకారం ఆయుధాలను ధరించే కనీస వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచారు. దీన్ని సహజంగానే రైఫిల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇదే సమయంలో పాఠశాలలో పనిచేసే సిబ్బంది, టీచర్లలో కొందరికి ఆయుధాలు దగ్గర ఉంచుకునేందుకు ఈ చట్టం వీలు కల్పించింది. అయితే వారు గతంలో సైనిక లేదా పోలీసు విధుల పరంగా అనుభవాన్ని కలిగివుండాలి. కాగా సెమీ ఆటోమేటిక్ ఆయుధాలను, ఆటోమేటిక్ ఆయుధాలుగా మార్చడాన్ని నిషేధించింది. ఇదే సమయంలో మానసిక ఆరోగ్యం కోసం కేటాయించే నిధుల మొత్తాన్ని పెంచింది. పార్క్‌లాండ్ పార్కు వద్ద కాల్పుల్లో మృతి చెందిన ఆరోన్ ఫీస్ పేరుమీద స్వచ్ఛంద ‘‘గార్డియన్ ప్రోగ్రామ్’’ను ప్రవేశపెట్టింది.
గవర్నర్ స్కాట్ తుపాకీ సంస్కృతి నియంత్రణకు, మానసిక ఆరోగ్య పరిరక్షణకు కేటాయించే నిధుల పెంపునకు పూర్తి మద్దతును ప్రకటించారు. అయితే తాను ‘‘గార్డియన్ ప్రోగ్రామ్’’ను సమర్ధించడం లేదన్నారు. ‘‘ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం తప్పనిసరి కాదు. పోలీసులు, స్కూలు బోర్డులు, స్థానిక ప్రజాప్రతినిధులు వారి అవసరాన్ని బట్టి స్వచ్ఛందంగా అమలు పరచుకోవచ్చు. దీన్ని అమలు పరచాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలి,’’అన్నారు.
పార్క్‌లాండ్‌లోని మెజారిటీ స్టోన్‌మెన్ డగ్లస్ హైస్కూల్ వద్ద 17 మందిని హత్యచేయడానికి నికోలాస్ క్రజ్ ఉపయోగించిన సెమీ ఆటోమేటిక్ ఎఆర్-15 అసాల్ట్ రైఫిల్స్‌ను నిషేధించకపోవడం గమనార్హం. ‘‘ఆయుధాలను నిషేధించే కంటే, కొంతమంది ప్రత్యేక వ్యక్తులు వీటిని కొనుగోలు చేయకుండా నిషేధిస్తే సరి’’ అని స్కాట్ అభిప్రాయపడ్డారు.