అంతర్జాతీయం

ట్రంప్‌ను చంపేద్దామనుకున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్‌ఏంజిలెస్, జూన్ 21: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థిగా తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై 19 ఏళ్ల ఓ బ్రిటిష్ యువకుడిపై అభియోగాలు దాఖలయ్యాయి. లాస్‌వెగాస్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఓ పోలీసు అధికారి నుంచి తుపాకీని లాక్కొని ట్రంప్‌పై కాల్పులు జరిపేందుకు ఈ యువకుడు యత్నించినట్టుగా ఇందులో పేర్కొన్నారు. శనివారం జరిగిన ర్యాలీలో ఈ సంఘటన జరిగింది. అయితే ఈ యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్‌ను చంపడానికే కాలిఫోర్నియా నుంచి లాస్‌వెగాస్‌కు తాను వచ్చినట్టు మైఖెల్ సాండ్‌ఫోర్డు అనే యువకుడు అంగీకరించాడు. ఇందుకోసం తుపాకీ ఎలా కాల్చాలోకూడా నేర్చుకున్నానని అన్నాడు. ఒకవేళ తాను తుపాకీ పేల్చగలిగినా రెండు మూడు రౌండ్లకు మించి దాన్ని పేల్చే శక్తి తనకు లేదని, ఒకవేళ పట్టుబడితే అధికారులు తనను చంపేస్తారన్న సంగతి తెలుసని సాండ్‌ఫోర్డ్ చెప్పాడు. ఒక వేళ లాస్‌వెగాస్‌లో తన ప్రయత్నం విఫలమైతే ఫినిక్స్‌లో జరిగే మరో ర్యాలీలోనైనా ట్రంప్‌ను చంపేద్దామని కూడా తాను సిద్ధపడ్డానని తెలిపాడు. ముస్లింలు, మెక్సికన్‌లు ఇతర వర్గాలపై ట్రంప్ పేలుతున్న అవాకులు, చెవాకులు కారణంగానే తానీ నిర్ణయానికి వచ్చానని మైఖెల్ వెల్లడించాడు.