అంతర్జాతీయం

పాక్ సెనేటర్‌గా కోల్హి ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 12: పాకిస్తాన్ చరిత్రలో తొలిసారిగా ఓ హిందూ దళిత మహిళ సెనేటర్‌గా ఎన్నికై చరిత్ర సృష్టించింది. ఎగువ సభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన 51మంది సెనేటర్లలో ఈమె కూడా ఒకరు. సింధ్ ప్రావిన్స్‌కు చెందిన నాగర్‌పార్కర్ ప్రాంతంలోని మారుమూల గ్రామం థార్‌కు చెందిన కృష్ణకుమారి కోల్హి అనే హిందూ దళిత మహిళ ఈ నెల 3న జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ తరఫున కృష్ణకుమారి పోటీచేసి చట్టసభల్లోకి అడుగుపెట్టింది. సింధ్ ప్రావిన్స్ నుంచి మైనారిటీ కోటా కింద కృష్ణకుమారికి టికెట్ కేటాయించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా కృష్ణకుమారి తన కుటుంబ సభ్యులతో, థారీ సంప్రదాయ దుస్తుల్లో పార్లమెంటుకు విచ్చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం కృష్ణకుమారి మీడియాతో మాట్లాడుతూ ప్రజారోగ్యం, రక్షిత నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. అలాగే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మహిళలు, మైనారిటీ హక్కుల సాధనలో తన విజయం ఓ మైలురాయి అని తెలిపారు. కాగా, సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఆర్థిక మంత్రి, పనామా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇషాక్ దర్ హాజరుకాలేదు.