అంతర్జాతీయం

ఇథియోపియా బస్సు ప్రమాదంలో 38మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డిస్ అబాబా: ఉత్తర ఇథియోపియాలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఓ నదిలో బోల్తాపడి 38 మంది దుర్మరణం చెందారు. 28 మంది పురుషులు, 10 మంది మహిళలు చనిపోయినట్టు ప్రభుత్వ మీడియా ‘్ఫనా’ వెల్లడించింది. అంహారా రాష్ట్రంలోని లెగాంబో జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి పది మంది బయటపడ్డారని అధికారులు తెలిపారు. అయితే వారందరూ గాయాలపాలైనట్టు చెప్పారు. డెస్సీ-మెకానే సేలం పట్టణాల మధ్య ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. ఓ ఆనకట్టను ఢీకొని బస్సు ప్రమాదానికి గురైందని, అయితే దీనికిగల కారణాలు తెలియరాలేదని అంహార ప్రభుత్వ ప్రతినిధి నిగుష్షు తిలాహున్ పేర్కొన్నారు. సాంకేతిక సమస్యా మరేదైనా సమస్యా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.