అంతర్జాతీయం

నైజీరియాలో 25 మంది దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాగోస్, మార్చి 14: నైజీరియాలో భూమి, నీరు, పశువుల మేతకోసం సాగుతున్న ఘర్షణలు తాజాగా 25 మందిని బలితీసుకున్నాయి. ప్లేటు స్టేట్‌కు చెందిన బస్సా ప్రాంతంలో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సరిగ్గా ఐదురోజులకు ముందు జరిగిన హింసలో ఐదుగురు మరణించారు. ఫులాని తెగకు చెందిన పశువుల కాపర్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో అనేక ఇళ్లను కూడా తగులబెట్టారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి హంతకులు పారిపోయారు. వీరికోసం పోలీసుల వేట కొనసాగుతోంది. నైజీరియాకు చెందిన మిడిల్ బెల్ట్‌లో ప్లేటు స్టేట్ ఉన్నది. ఇందులో ఉత్తర భాగంలో అధిక సంఖ్యాకులు ముస్లింలు కాగా, దక్షిణ ప్రాంతంలోనివారు క్రైస్తవులు. ముస్లింలు పశువుల కాపర్లుగా జీవనం వెళ్లదీస్తుండగా, క్రైస్తవులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ముస్లింలు ముఖ్యంగా హౌసా/పులాని తెగలకు చెందిన పశువుల కాపర్లు. ఈ రెండు మతాలవారి మధ్య భూమి, నీరు, పశువుల మేపుకోవడం వంటి అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి.