అంతర్జాతీయం

చైనాలో బయటపడిన కొత్త రాతియుగ అవశేషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 14: చైనాలో జరుపుతున్న తవ్వకాల్లో 8వేల ఏళ్లనాటి కొత్త రాతి యుగానికి చెందిన గ్రామం బయటపడింది. ఈశాన్య చైనా లియోనింగ్ ప్రావెన్స్‌కు చెందిన ఫక్సిన్ నగరంలో ఈ గ్రామం వివరాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపి 2500 పురాతన వస్తువులను వెలికి తీశారు. బయటపడిన 12 ఇళ్లు పాక్షిక భూగృహాల మాదిరిగా ఉన్నాయి. ప్రతిదాంట్లో వంటకు ప్రత్యేక సదుపాయాలుండటం విశేషం. వీటి ముందు మురుగునీటి కాల్వలను కూడా కనగొన్నట్టు చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువా తెలియజేసింది. ఇక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని ఛహాయ్ గ్రామంలో గతంలో నియోలిథిక్ అవశేషాలు బయల్పడ్డాయి. లియోనింగ్ యూనివర్సిటీ, చరిత్ర విభాగానికి చెందిన వాంగ్ ఛువాంగ్ మాట్లాడుతూ, ఇదే సంస్కృతికి సంబంధించిన తొలి మానవుడి ఆనవాళ్లు గ్జిన్‌గ్లోంగువాలో కనుగొన్నట్టు తెలిపారు. ఈ అవశేషాలు మానవుడు ఒకవైపు వేట కొనసాగిస్తూనే, మరోవైపు వ్యవసాయాంవైపు తొలి అడుగులు వేసిన నాటివని ఆయన పేర్కొన్నారు.