అంతర్జాతీయం

యోగతో సామరస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జూన్ 21: సామరస్యాన్ని సాధించటమే యోగ లక్ష్యమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్ అన్నారు. దేశాలకు అతీతంగా ప్రజలంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రెండో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తన సందేశాన్నిచ్చారు. ‘జాతి, విశ్వాస, లింగ వివక్షలకు అతీతంగా తోటి మనుషులతో సమైక్యం కావలసిన అవసరం ఉంది. యోగద్వారా ఆరోగ్యకరమైన అవకాశాలను అందరూ అందిపుచ్చుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబ సభ్యుల్లా ఒక పండుగలా ఈ రోజును.. ప్రతిరోజునూ జరుపుకోవాలి’ అని పేర్కొన్నారు. బాన్ సందేశాన్ని ప్రముఖ భారతీయ దౌత్యవేత్త విజయ్ నంబియార్ చదివి వినిపించారు. ‘యోగ శరీరాన్ని ఆత్మను ఏకం చేస్తుంది. భౌతిక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తుంది. మనకు, ప్రకృతి మధ్య సామరస్యాన్ని పెంచుతుంది’ అని బాన్ వ్యాఖ్యానించారు. లాగా యోగవల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకునేందుకు ఇది ఎంతో తోడ్పడుతుందని అన్నారు. కేన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధుల నియంత్రణకు యోగ ఎంతో ఉపయోగపడుతుందని బాన్ కి మూన్ వ్యాఖ్యానించారు. ఐరాసలో జరిగిన కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప బహుమతి యోగ అని అన్నారు. ‘మనం ఒకటి అర్థం చేసుకోవాలి. యోగ భారత్‌ది మాత్రమే కాదు. మీరు యోగను భారత్‌ది అని అనేటట్లయితే, గురుత్వాకర్షణ శక్తి యూరప్‌ది అని అనాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.

చిత్రం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం విదేశాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చైనా రాజధాని బీజింగ్ శివార్లలో గాజు ఫ్లాట్‌ఫామ్‌పై, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్ వద్ద, ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని ఒపేరా హవుస్ వద్ద యోగాసనాలు వేస్తున్న ఔత్సాహికులు