అంతర్జాతీయం

కొంపముంచిన చెక్క పడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏథెన్స్, మార్చి 17: గ్రీక్ ఐలాండ్‌లోని ఈస్ట్రన్ ఎయిజియన్ సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. వలసవాదులను అక్రమంగా తీసుకెళ్తున్న బోట్ ప్రమాదానికి గురైనట్టు గ్రీస్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించి 14 మృతదేహాలను వెలికితీసినట్టు వారు తెలిపారు. మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సమోస్ ద్వీపానికి దక్షిణంగా అగతోనిసిలో తొలుత నలుగురు పిల్లలు, ఒక పురుషుడు, ఒక స్ర్తి మృతదేహాన్ని కోస్ట్‌గార్డ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మరో ఎనిమిది మంది మృతదేహాలు లభ్యమైనట్టు వారు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు ముగ్గుర్ని రక్షించాయి. ప్రమాదం నుంచి బయటపడ్డవారిలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. చెక్క పడవలో తాము ప్రయాణిస్తుంగా మునిగిపోయిందని వారు వెల్లడించారు. పడవలో మొత్తం 21 మంది ఉన్నారని వారు చెప్పారు. అయితే దీనిపై స్పష్టత లేదని అధికారులు అన్నారు. మూడు హెలీకాప్టర్లు, గ్రీక్ నేవీ, కోస్టు గార్డు నౌకలు గాలింపుచర్యల్లో పాల్గొన్నాయి. టర్కీస్ తీరం నుంచి సమీపాన ఉన్న గ్రీక్ ద్వీపాలకు వలసవాదులు, శరణార్థుల అక్రమ రవాణాను నిరోధించేందుకు యూరోపియన్ యూనియన్, టర్కీ మధ్య ఓ ఒడంబడిక కుదిరింది. అయినప్పటికీ అక్రమ వసలను ఆపలేకపోతున్నారు. ప్రతి వారం డజన్లకొద్దీ, వందలాది మంది వలసవాదుల అక్రమ రవాణా సాగుతోంది. ప్రయాణ సౌలభ్యంకాని పడవల వల్ల ప్రమాదాలు నితృకృత్యమయ్యాయి.