అంతర్జాతీయం

రష్యా పీఠంపై మళ్లీ పుతిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, మార్చి 19: రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ ఘనవిజయం సాధించారు. దీంతో ఆయన మరో ఆరేళ్లపాటు రష్యా అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఇప్పటివరకు రెండు దశాబ్దాలకుపైగా రష్యాను పాలించిన పుతిన్‌కు ఈ ఎన్నికల్లో 75 శాతానికి పైగా ఓట్లు లభించినట్లు ప్రాథమిక ఫలితాలను బట్టి తెలుస్తోంది. అధ్యక్షపదవికి పుతిన్‌తో మొత్తం ఏడుగురు పోటీపడ్డారు. కాగా పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావెల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం కూడా పుతిన్‌కు కలిసొచ్చింది. అయితే పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు అనామకులు కావడంతో పుతిన్‌కు ఎదురేలేకుండా పోయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా పుతిన్‌కు ఘనవిజయం తప్పదని తేల్చేశాయి. ఈ విజయంతో రష్యాను సుదీర్ఘకాలం పాలించిన స్టాలిన్ తర్వాత ఎక్కువకాలం అధికారంలో కొనసాగిన అధ్యక్షుడిగా పుతిన్ నిలిచిపోయారు. మొత్తం 107 మిలియన్ల రష్యన్లు ఓటుహక్కు వినియోగించుకోవడానికి అర్హులు కాగా, మరో మూడు గంటల్లో పోలింగ్ ముగుస్తుందనగా 60 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. బ్రిటన్‌లో ఒక గూఢచారికి విషం ఇవ్వడం, తాజాగా అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో రష్యా ప్రస్తుతం అంతర్జాతీయంగా ఏకాకిగా మిగిలిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగడం గమనార్హం. కాగా ఈ ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన యదేచ్ఛగా జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
2000లో మొట్టమొదటిసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గరినుంచి పుతిన్ ప్రభుత్వంపై తన పట్టును క్రమంగా పెంచుకుంటూ వస్తున్నారు. విపక్షాల నోరు నొక్కేయడం, టెలివిజన్ ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొని రావడం వంటి చర్యలు తీసుకోవడమేకాక, ప్రపంచంలో రష్యాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.