అంతర్జాతీయం

ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై కనె్నర్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 20: ఇమ్మిగ్రేషన్ కొత్త నిబంధనలతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ అమెరికాలోని భారతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమెరికా వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందలాది మంది నిపుణులు శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించారు. ఇండియన్ అమెరికన్లు ప్రధానంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన హెచ్1బీ వర్క్ వీసాలపై ఉంటున్నవారు అమెరికా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గ్రీన్‌కార్డుపై కొనసాగుతున్న సందిగ్ధ వాతావరణానికి స్వస్తిచెప్పాలని వారు డిమాండ్ చేశారు. రోజుకో కొత్త నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం భయాందోళన సృష్టిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్‌కార్డుల పరిమితి ఎత్తివేయాలని తమ న్యాయమైన డిమాండ్లకు ప్రజాప్రతినిధులు మద్దతు ఇవ్వాలని భారతీయ నిపుణులు అభ్యర్థించారు.