అంతర్జాతీయం

మయన్మార్ అధ్యక్షుడు హితన్ క్యా రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాంగాన్, మార్చి 21: మయన్మార్ అధ్యక్షుడు, అంగ్ సాన్ సూకి విధేయుడు అయిన హితిన్ క్యా (71) తన పదవికి రాజీనామా చేశారు. ఇక విశ్రాంతి కోసమే తాను పదవికి రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత ఏడాది అనారోగ్యం కారణంగా ఆయన రెండుసార్లు విదేశాల్లో చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. రాజ్యాంగ నియమాల ప్రకారం వారం రోజుల్లో కొత్త నాయకుడిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని మయన్మార్ అధ్యక్షుడి కార్యాలయం ఫేస్‌బుక్‌లో పేర్కొంది. హితిన్ క్యా 2016లో మయన్మార్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1962 తర్వాత దేశంలో మొట్టమొదటి పౌర ప్రభుత్వ అధ్యక్షుడు ఆయనే కావడం గమనార్హం. 1962లో కుట్రద్వారా పౌర ప్రభుత్వాన్ని కూలగొట్టి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇదిలా వుండగా 2016లో సూ కీ దేశాధ్యక్షురాలవుతారని భావించారు. కాని విదేశీయుడిని వివాహమాడారన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో హితిన్ క్యా, సూ కి ప్రతినిధిగా వ్యవహరిస్తూ పాలన సాగించారు. సూ కి సలహాదారుగా వ్యవహరించారు. దేశాధ్యక్షుడిగా వ్యవహరించిన హితిన్ క్యా, విదేశాంగ శాఖను కూడా నిర్వహించారు. ఐతే దేశాధ్యక్షుడిగా ఆయన అధికారాలు పరిమితం. హితిన్ క్యా పదవినుంచి దిగిపోతారని దాదాపు అంతా అంచనా వేసిందే. అయితే నూతన అధ్యక్షుడుగా ఎన్నికయ్యే నేత ధైర్యంగా వ్యవహరిస్తే తప్ప ప్రాచుర్యం పొందలేరు. మయన్మార్ తాత్కాలిక అధ్యక్షుడిగా మింట్ స్వే (66) వ్యవహరిస్తారు. మింట్ స్వే, సీనియర్ జనరల్‌కు సన్నిహితుడుగా పేరుపడ్డారు.