అంతర్జాతీయం

న్యూయార్క్ వేలంలో 5కోట్లు పలికిన తిలోత్తమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్: ప్రఖ్యాత భారతీయ చిత్రకారుడు రాజా రవివర్మ చిత్రరాజం తిలోత్తమకు న్యూయార్క్‌లోని సోత్‌బేస్ వేలం కేంద్రంలో 5.17 కోట్ల రూపాయల ధర పలికింది. కేంద్రం నిర్వాహకులు 3.90 కోట్ల రూపాయలు వస్తాయన్న అంచనాలు తల్లకిందులు చేస్తూ ఆధునిక, దక్షిణాసియా సమకాలిన కళకు అత్యధిక ధర పలికింది. హిందూ పురాణాల నుంచి గ్రహించిన వనదేవతను రాజా రవివర్మ అత్యద్భుతంగా మలిచారు. రామాయణ, మహాభారతంకు సంబంధించి సన్నివేశాలకు ఆయన ఎన్మో చిత్రాలు గీశారు. దేశ, విదేశాల్లో రవివర్మ చిత్రాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. కళాభిమానుల మనసుదోచుకున్న చిత్రాలు ఎన్నో. 1979లో భారత ప్రభుత్వం రాజా రవివర్మ చిత్రాలను జాతీయ నిధిగా ప్రకటించింది. రవివర్మ కుంచె వెలకట్టలేనిది. స్ర్తిని సౌందర్యరాశిగా ఆయన గీచిన చిత్రాలు కళాభిమానులు హృదయాలు దోచుకున్నాయి. దివి నుంచి భువికి దిగివచ్చేలా అప్సరసల చిత్రాలు అత్యద్భుతం.