అంతర్జాతీయం

దుస్సాహసానికి పాల్పడవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, మార్చి 28: సరిహద్దు వెంట ఏవిధమైన దుస్సాహసానికి పాల్పడవద్దని పాక్ సైన్యం భారత్‌ను హెచ్చరించింది. పాకిస్తాన్ సైన్య సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని పేర్కొంది. ‘‘్భరత్ దుస్సాహసానికి పాల్పడితే, అందుకనుగుణంగా స్పందిస్తాం. తిప్పికొడతాం’’ అని పాక్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ ఘూ్ఫర్ బుధవారం మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఒకవేళ భారత్ ఆకస్మిక దాడికి పాల్పడితే తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం సంసిద్ధంగా ఉన్నదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, తమ సైన్యాన్ని తక్కువ అంచనా వేయవద్దన్నారు. భారత్‌నుంచి ఏవిధమైన దాడి జరిగినా తిప్పికొట్టడానికి సిద్ధంగానే ఉన్నామన్నారు. 2018లో నియంత్రణ రేఖ వెంట 30 మంది పాక్ పౌరులు, భారత సైన్యం కాల్పుల్లో మరణించారన్నారు. ‘పాకిస్తాన్ ఎల్లవేళలా శాంతినే కోరుకుంటోంది. కానీ భారత్ నియంత్రణ రేఖ లేదా ఆఫ్ఘనిస్తాన్ ద్వారా పాకిస్తాన్‌లో అస్థిరతను సృష్టించేందుకు యత్నించడం వల్ల ఫలితం ఉండదు’ అన్నారు. మార్చి 23న నిర్వహించే పాకిస్తాన్ డే పరేడ్‌కు ఇతర దేశాల దౌత్యవేత్తలతో పాటు భారత దౌత్యవేత్తలను కూడా ఆహ్వానించామన్నారు. ‘వారు (్భరత్) మా దౌత్యవేత్తల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నప్పటికీ, వారి దౌత్యవేత్తలను ఆహ్వానించడం సమస్య పరిష్కారం విషయంలో మా నిబద్ధతను తెలియజేస్తోంది’ అన్నారు.