అంతర్జాతీయం

బస్సులో మంటలు.. 20మంది సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాంకాక్, మార్చి 30: థాయ్ సరిహద్దునుంచి బాంకాక్‌కు వెళుతున్న ఓ బస్సు అగ్ని ప్రమాదానికి గురై 20మంది సజీవ దహనమయ్యారు. వీరంతా కార్మికులుగా పనిచేస్తున్న మయన్మార్ శరణార్థులని అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణాలు పూర్తి గా తెలియరాలేదు. కానీ అగ్నికీలల్లో చాలామంది కార్మికులు చిక్కుకున్నట్లు టీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. ‘ఇప్పటి వరకు 20మంది మృతులు అగ్నికి ఆహుతయ్యారని, మరో ముగ్గురు తీవ్రంగా గా యాల పాలయ్యార’ని అధికారులు తెలిపారు. 47మంది ప్రయాణికులున్న ఈ బస్సు మధ్యాహ్నం 1.25కి అగ్నిప్రమాదానికి గురైందని పేర్కొన్నారు. కాగా, థాయ్‌లాండ్‌లో మయన్మార్ శరణార్థులకు అతి తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. అతి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న ఈ శరణార్థులు తరచూ వేధింపులకు గురికావడమే కాకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడమే కాకుండా రోడ్డు భద్రతా చర్యలు అంతంతమాత్రంగా ఉన్న థాయ్‌లాండ్‌లో ప్రతి ఏటా 24వేలమంది మృత్యువాత పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తేటతెల్లం చేస్తోంది. వారం క్రితమే ఓ బస్సు ప్రమాదానికి గురై 18మంది మృతి చెందారు.