అంతర్జాతీయం

తూర్పు లిబియాలో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంఘాజీ, మార్చి 30: తూర్పు లిబియాలో శుక్రవారం జరిగిన కారుబాంబు దాడిలో మొత్తం ఎనిమిదిమంది మరణించారు. నెలరోజుల్లో ఇటువంటి దాడి జరగడం ఇది రెండోసారి. లిబియా ఉక్కు మనిషి ఖలీఫా హఫ్తార్ విధేయులైన సైనికులు కాపలా కాస్తున్న బారికేడ్ వద్దకు పేలుడు పదార్థాలు నింపిన వాహనంతో వచ్చిన ఉగ్రవాది వాహనాన్ని ఒక్కసారి పేల్చేశాడని పోలీసులు తెలిపారు. ట్రిపోలీకి 840 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్దాబియా పట్టణంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే ఈ సంఘటనకు బాధ్యులమంటూ ఏ సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు.