అంతర్జాతీయం

మాకు నష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 7: తాను అధికారంలోకి వచ్చిన మొదట్లో పారిస్ పర్యావరణ ఒప్పందంపై తీవ్ర విమర్శలు గుప్పించి దానినుంచి వైదొలిగిన అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏకంగా ప్రపం చ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)పైనే గురిపెట్టారు. ఈ సంస్థ మొదటినుంచీ కూడా అ మెరికా ప్రయోజనాలకు విఘాతకరంగానే పని చేస్తోందని 164 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఈ సంస్థ తమ దేశం విషయంలో వివక్షా పూరితంగానే వ్యవహరించిందని ట్రంప్ వెల్లడించారు. చైనాతో తా జాగా తలెత్తిన వాణిజ్య యుద్ధం నేపథ్యం లో ప్రపంచ వాణిజ్య సంస్థపైనే అమెరికా అధ్యక్షుడు విమర్శలు గుప్పించడం వ్యూ హత్మక చర్యగా భావిస్తున్నారు. తమ మ ధ్య తలెత్తిన వాణిజ్య యుద్ధంలో రిఫరీగా వ్యవహరించాలని డబ్ల్యూటీవోను చైనా అభ్యర్థించిన నేపథ్యంలో ట్రంప్ తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఇప్పటికే డబ్ల్యూటీవో నిర్ణయాల వల్ల వివక్షాపూరిత ఒడంబడికల వల్ల అమెరికా ఎంతగానో నష్టపోయిందని, ఇప్పుడు చైనా అభ్యర్థన మేరకు తాజా వా ణిజ్య యుద్ధంలో ఈ సంస్థే రిఫరీగా వ్యవహరిస్తే తమకు మరింత అన్యాయం జరిగే ప్రమాదం ఉందని ట్రంప్ తెలిపారు. ప్ర పంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా రాణిస్తున్న చైనాను ప్రపంచ వా ణిజ్య సంస్థ అభివృద్ధి చెందిన దేశంగానే పరిగణిస్తోందని ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో డబ్ల్యుటీవో రిఫరీగా వ్యవహరిస్తే అనేక రకాలుగా రాయితీలు, తాయిలాలు, ప్రయోజనాలు అమెరికాకంటే కూడా ఎక్కువగా చైనాకే ఒనగూడే అవకా శం ఉంటుందని ట్రంప్ ఆవేదన వెళ్లగక్కా రు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా తాజా ఆలోచనను డబ్ల్యుటీవో ఏవిధంగా సమర్థిస్తుం ది? చైనా కోరినట్టుగా ఈ సంస్థ రిఫరీగా వ్యవహరిస్తే కచ్చితంగా అమెరికాకు మరిం త అన్యాయం తప్ప మరేమీ జరిగే అవకా శం లేదని ట్రంప్ అన్నారు. డబ్ల్యుటీవోతోపాటు నాటో సహా అనేక ప్రపంచ సంస్థల తీరుతెన్నులపై ట్రంప్ ఇప్పటికే అనుమానాలను, సందేహాలను వ్యక్తం చేసిన విష యం తెలిసిందే. ఈ ప్రపంచ సంస్థల ప్రధా న లక్ష్యం అమెరికా శక్తిని నీరుగార్చడమేనని ఆయన పేర్కొన్నారు.