అంతర్జాతీయం

కోర్టులో ప్రమాణం చేసి సమాధానం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 9: తన లాయర్ అడిగే ప్రశ్నలకు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేసి మరీ సమాధానం చెప్పాలని, పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్ కోరింది. ఈ మేరకు లాస్ ఏంజిలిస్‌లోని ఫెడరల్ కోర్టులో తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు డోనాల్డ్ ట్రంప్ తన లాయర్ మైఖెల్ కోహెన్ ద్వారా 1,30,000 అమెరికన్ డాలర్లను తనకు చెల్లించారని డేనియల్స్ చెబుతోంది. తనకు ట్రంప్‌కు ఉన్న లైంగిక సంబంధాన్ని బయటపెట్టకుండా ఉండేందుకే పై మొత్తం చెల్లించారని ఆమె పేర్కొంది. దీనిపై మొట్టమొదటి సారి గతవారం డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ, కోహెన్ ఆ మొత్తాన్ని చెల్లించిన విషయం తనకు తెలియదని సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని చెల్లించలేదని ట్రంప్, ఆయన లాయర్ ప్రమాణం చేసి మరీ వెల్లడించాలని డేనియల్ లాయర్ మైఖేల్ అవెన్టీ తన పిటిషన్‌లో కోరారు.