అంతర్జాతీయం

జర్మనీ థియేటర్‌లో కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాంక్‌ఫర్ట్, జూన్ 23: జర్మనీలోని వీర్న్‌హైమ్ పట్టణంలోని ఓ మల్టీప్లెక్స్ సినిమా హాలులోకి గురువారం ముసుగు ధరించిన సాయుధ దుండగుడు ప్రవేశించి కాల్పులు జరపడంతో పలువురు గాయపడినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. 50 మందిదాకా గాయపడినట్లు అనధికారిక వార్తలను బట్టి తెలుస్తోంది. కాగా, పోలీసు ఆపరేషన్‌లో భాగంగా జరిపిన భాష్పవాయు ప్రయోగంలో కనీసం 25 మంది గాయపడినట్లు స్థానిక దినపత్రిక ‘బిల్డ్’ తెలిపింది. తుపాకీ కాల్పుల శబ్దాలు తాము విన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారుకానీ అవి నిజమైన కాల్పులో కాదో తెలియదన్నారు. కాగా, దాడి చేసిన దుండగుడ్ని ఆ తర్వాత పోలీసులు కాల్చి చంపినట్లు స్థానిక మీడియా తెలిపింది. అస్పష్టమైన ముప్పు పరిస్థితి ఉందని మాత్రమే చెప్పిన పోలీసులు వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. అయితే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో దుండగుడు సినిమా హాలులోకి ప్రవేశించి చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు చేసుకున్నాడని, అతడ్ని చూసి జనం భయంతో హాలులోంచి పరుగులు తీశారని మరో స్థానిక దినపత్రిక తెలిపింది.