అంతర్జాతీయం

నిరుపమాన ప్రభావశీలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఏప్రిల్ 19: టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుల జాబితాలో ఒలా సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్, బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యానాదెండ్ల చోటు సంపాదించారు. వీరి పేర్లు జాబితాలోని తొలి వంద స్థానాల్లోపే ఉండటం గమనార్హం. ఇక వార్షిక గౌరవనీయుల జాబితాలోఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు చేర్చారు. ఫ్లిప్‌కార్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సాల్, అగర్వాల్ ప్రొఫైల్ గురించి రాస్తూ, ఆయన తనలోని ‘‘విజన్, ఉత్సాహం, దృఢసంకల్పం’’ కారణంగా జీవితంలో ఎదురయ్యే ఎన్ని సమస్యలనైనా అవలీలగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. పడుకొనె గురించి వీన్ డీజిల్ వివరిస్తూ, ఆమె ‘కేవలం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి ప్రతినిధి’ అని పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ గురించి వివరిస్తూ, ‘నిరంతరం పరుగుల దాహంతో ఉంటాడు’ అని ప్రశంసలు కురిపించాడు. సత్య నాదెండ్ల ప్రొఫైల్‌ను రాసిన వాల్టన్ ఇసాక్సన్,..‘ మైక్రోసాఫ్ట్ సీఈఓ అయిన దగ్గరినుంచి సత్య నాదెండ్ల కంపెనీలో సృజనాత్మక స్ఫూర్తిని నింపుతున్నారు’ అని పేర్కొన్నారు. సత్యనాదెండ్ల కృషి వల్ల గత నాలుగేళ్లలో కంపెనీ మెర్కెట్ విలువ 130 శాతం పెరిగిందన్న సంగతిని ఆయన గుర్తు చేశారు. ఈ జాబితాలో 45 మంది 40 ఏళ్లకంటే తక్కువ వయసున్నవారేనని టైమ్స్ మ్యాగజీన్ పేర్కొంది. వీరిలో అతిపిన్న వయస్కుడు 14 ఏళ్ల నటుడు మిల్లీ బాబీ బ్రౌన్ చోటు సంపాదించడం విశేషమని పేర్కొంది. ‘స్ర్తిపురుష సమానత్వం విషయంలో ప్రపంచం ఇంకా చాలా వెనుకబడే ఉన్నప్పటికీ, ఈ వందమంది జాబితాలో మహిళలే అధికంగా ఉండటం, ప్రపంచంలోని సంప్రదాయ అధికార నిర్మాణం (పురుషుల)లో మార్పును సూచిస్తోంది’ అని టైమ్ మ్యాగజీన్ స్పష్టం చేసింది.

చిత్రాలు..దీపిక, కోహ్లీ