అంతర్జాతీయం

అణ్వస్త్ర పరీక్షలు ఆపేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, ఏప్రిల్ 21: అణ్వాయుధ పరీక్షలతో ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఉత్తర కొరి యా శనివారం సంచలన ప్రకటన చేసింది. అణ్వాయుధ, మీడియం రేంజ్, ఖండాంతర క్షిపణి పరీక్షలు ఇకపై నిర్వహించబోమంటూ ప్రకటించి సంచలనం రెకెత్తించింది. ఉత్తర కొరియా ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ‘అతి పెద్ద పురోగతి’ అంటూ ట్వీట్‌లో చేశారు. అణ్వాయుధాల నిరోధంపై కొద్దిరోజులుగా అమెరికా, దక్షిణ కొరియా, ఉ.కొరియాల మధ్య చర్చలు సాగుతోన్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో డొనాల్డ్ ట్రంప్, కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో ఉ.కొరియా ఈ ప్రకటన చేయడం చర్చల ప్రగతికి కీలక అడుగుగా చెబుతున్నారు. సరిహద్దుల్లో ఆర్మీ ఉపసంహరణ అంశానికి సంబంధించి గతవారం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్‌తో ఉ.కొరియా ప్రతినిధి సమావేశమై వారం తిరక్కముందే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఇదిలావుంటే, సుదూర యుఎస్‌లోని లక్ష్యాన్ని సైతం చేధించగల అణ్వాయుధ క్షిపణులను ఇప్పటికే సిద్ధం చేసుకున్న ఉ.కొరియా, వాటిని ఏం చేయబోతున్నారన్న అంశాన్ని కిమ్ తన ప్రకటనలో ఎక్కడా ప్రస్తావించలేదు. మిసైళ్లతో అనుసంధానించి ప్రయోగించగల మినీయేచర్ వార్‌హెడ్స్ సహా ఆయుధ సంపత్తిని ఉ.కొరియా విజయవంతంగా వృద్ధి చేసిందని అంటూనే, ‘ఇకపై న్యూక్లియర్, ఖండాంతర క్షిపణి పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం డీపీఆర్‌కెకు లేదు’ అంటూ అధికార వర్కర్స్ పార్టీ సెంట్రల్ కమిటీకి కిమ్ వెల్లడించినట్టుగా కెసిఎన్‌ఏ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. గత నవంబర్ నుంచీ ఎలాంటి అణ్వస్త్ర పరీక్షలకూ ఒడిగట్టని ఉ.కొరియా, శనివారం నుంచి పరీక్షలకు పూర్తిగా స్వస్తి చెబుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. తన నిర్ణయంలోని పారదర్శకతను నిరూపించుకోవడానికి పంగ్యే-రిలోని అణ్వాయుధ పరీక్షల ప్రాంతాన్ని మూసివేస్తున్నామని కూడా ప్రకటించింది.
ఉ.కొరియా నుంచి ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ‘ఉ.కొరియాకే కాదు, ప్రపంచానికే ఇది అతి పెద్ద శుభవార్త. అణ్వాయుధ నిరోధక చర్చల సమావేశానికి ఇది పెద్ద పురోగతి’ అని ట్వీ ట్‌లో పేర్కొన్నారు. కిమ్ జోంగ్‌తో సమావేశానికి డొనాల్డ్ ట్రంప్ ఉత్సుకత చూపుతున్నట్టు కూడా కథనాలు వెలువడుతున్నాయి. ‘కొరియన్ ద్వీపక ల్పం ప్రగతికి ఇదొక అర్థవంతమైన పురోగతి’ అం టూ సియోల్ సైతం దీనిపై స్పందించింది.
చిత్రాలు..ఉత్తర కొరియా కార్మిక పార్టీ కేంద్ర కమిటీ ప్లీనరీలో మాట్లాడుతున్న దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్